Movie News

తమన్నాకు తెలుగులో మళ్లీ ఓ మంచి ఛాన్స్?

ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్ హీరోయిన్‌గా కొనసాగింది. ఈ మధ్యే ఆమె కథానాయికగా 20 ఏళ్ల ప్రస్థానాన్ని కూడా పూర్తి చేసుకుంది. ఇన్నాళ్లు ఇండస్ట్రీలో ఉండడం గొప్ప విషయం.

ఐతే కొన్నేళ్లుగా ఆమె ఎక్కువగా ఐటెం సాంగ్స్ చేస్తోంది. వేరే భాషల్లోనే సినిమాలు చేస్తోంది. తెలుగులో అవకాశాలు దాదాపుగా ఆగిపోయాయి. గత ఏడాది ‘ఓదెల-2’ సినిమాలో ముఖ్య పాత్ర పోషించింది కానీ.. కమర్షియల్ సినిమాల్లో ఛాన్సులు దక్కే పరిస్థితి కనిపించడం లేదు. చివరగా ఆమె మెగాస్టార్ చిరంజీవి సరసన ‘భోళా శంకర్’లో నటించింది. తర్వాత ఏ స్టార్ చిత్రంలోనూ ఛాన్స్ రాలేదు. ఐతే ఇప్పుడు మాస్ రాజా రవితేజ సినిమాలో తమన్నాకు ఓ కీలక పాత్ర దక్కినట్లు సమాచారం.

ఇటీవల మాస్ సినిమాలు మానేసి డిఫరెంట్ మూవీస్ చేస్తున్నాడు రవితేజ. సంక్రాంతికి వచ్చిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఆయన ఇమేజ్‌కు పూర్తి భిన్నమైన మూవీ. దీని తర్వాత ‘ఇరుముడి’ పేరుతో ఒక వెరైటీ మూవీని లైన్లో పెట్టాడు. ఇందులో ఆయన భార్యగా తమిళ నటి ప్రియ భవానీ శంకర్ నటిస్తోంది. ఐతే ఈ చిత్రంలో మరో హీరోయిన్‌ కూడా ఉంటుందట.

కథలో కీలకంగా ఉండే ఆ పాత్రకు తమన్నాను ఎంచుకున్నారట. తమన్నా గతంలో రవితేజతో ‘బెంగాల్ టైగర్’ సినిమాలో నటించింది. అందులో ఆమెది ఫుల్ గ్లామర్ టచ్ ఉన్న పాత్ర. ఈ సారి చేస్తోంది పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్.

నిన్నుకోరి, మజిలీ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ రూపొందిస్తున్న ‘ఇరుముడి’లో రవితేజ అయ్యప్ప మాల వేసే సాధారణ మధ్య తరగతి వ్యక్తిగా కనిపించనున్నాడు. ఇంతకుముందు రవితేజతో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ లాంటి డిజాస్టర్ చేసిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ‘ఇరుముడి’ని ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

This post was last modified on March 11, 2026 5:12 pm

Share

Recent Posts

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

19 minutes ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

2 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

3 hours ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

4 hours ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

11 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

14 hours ago