మోడీతో ప‌వ‌న్‌, చంద్ర‌బాబు ర‌హ‌స్య భేటీ!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీతో టీడీపీ అధినేత చంద్ర‌బాబు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌లు ర‌హ‌స్యంగా భేటీ అయ్యారా?  ఆయ న‌తో 15 నిమిషాల‌పాటు హెలీ ప్యాడ్ వ‌ద్దే నిల‌బ‌డి చ‌ర్చించారా? అంటే.. ఔన‌నే అంటున్నారు టీడీపీ నాయ‌కులు. ప‌ల్నాడు జిల్లాలో ని చిల‌క‌లూరిపేట‌లో ఉన్న బొప్పూడి వ‌ద్ద టీడీపీ-జ‌న‌సేన‌-బీజేపీ కూట‌మి సంయుక్తంగా ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌ను నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. ఈ స‌భ అనంత‌రం.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన వాహ‌న శ్రేణి పార్కింగ్ వ‌ద్ద‌కు చేరుకున్నారు.

అయితే.. మోడీని గౌర‌వ ప్ర‌దంగా సాగ‌నంపే ఉద్దేశంతో చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు కూడా ఆయ‌న‌ను అనుస‌రించారు. కొద్ది దూరం మోడీని అనుస‌రించారు. ఇంత‌లో అధికారులు ఆయ‌న చుట్టూ చేరారు. దీంతో ప్ర‌త్యేక వాహ‌న శ్రేణి పార్కింగ్ చేసిన ప్ర‌దేశానికి ప‌ది అడుగుల దూరంలోనే చంద్ర‌బాబు, ప‌వ‌న్ ఆగిపోయారు. అయితే.. కొద్ది దూరం ముందుకు న‌డిచిన మోడీ తిరిగి వెన‌క్కి చూసి.. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌లు ఏరి.. అన్న‌ట్టుగా వెతికారు. మోడీని కాస్త దూరం నుంచి గ‌మ‌నిస్తున్న చంద్ర‌బాబు, ప‌వ‌న్ ఆయ‌న చెంత‌కు చేరుకున్నారు.

ఈ క్ర‌మంలో త‌న సిబ్బందిని కొంత దూరం ఉండ‌మ‌ని క‌నుసైగ చేసిన ప్ర‌ధాని మోడీ.. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌ల‌తో ప్ర‌త్యేకంగా ప‌దిహేను నిమిషాల పాటు చ‌ర్చ‌లు జ‌రిపారు. సభ బాగా జరిగిందని…ప్రజల్లో చాలా ఉత్సాహం ఉందని వ్యాఖ్యానించిన ప్రధాని ఎన్డిఎ కూటమి గ్రాండ్ సక్సెస్ అవుతుందని అభిప్రాయ పడినట్టు టీడీపీ వ‌ర్గాలు చెప్పాయి. అదేవిధంగా చంద్రబాబు అరెస్టు ఘటనపైనా, ఆయన ఆరోగ్యం పైనా టీడీపీ అధినేత తో మోడీ మాట్లాడినట్లు సమాచారం. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను ప్రధానికి చంద్రబాబు, పవన్ వివ‌రించిన‌ట్టు తెలిసింది. రాష్ట్రంలో వ్యవస్థల‌ విధ్వంసంపై  పలు అంశాలు ఉదహరిస్తూ ప్రధాని దృష్టికి తీసుకువెళ్లిన ఇరువురు నేతలు ఒక నివేదిక‌ను కూడా ఆయ‌న చేతిలో పెట్టార‌ని పార్టీ వ‌ర్గాలు చెప్పాయి.