Political News

15 మంది జనసేన అభ్యర్థులు ఖరారు

పొత్తులో భాగంగా జనసేన పోటీ చేస్తానని భావించిన 24 స్థానాలకు 21 స్థానాలకు కుదించుకోవటం తెలిసిందే. ఇందులో అధికారికంగా ఆరు స్థానాలకు చెందిన అభ్యర్థుల పేర్లను ప్రకటించటం తెలిసిందే. బుధవారం రాత్రి వేళలో మరో తొమ్మిది మంది అభ్యర్థులకు పచ్చజెండా ఊపుతూ నిర్ణయం తీసుకున్నారు. అభ్యర్థులను వ్యక్తిగతంగా పిలిపించుకున్న జనసేనాని పవన్ కల్యాణ్.. అభ్యర్థులుగా ఖరారు చేసిన వారితో ప్రత్యేకంగా మాట్లాడి.. ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలన్న విషయాన్ని చెప్పి వారి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. అభ్యర్థులుగా ప్రచారం చేసుకోవటానికి ఓకే చెప్పేశారు.
ఈ తొమ్మిది మందిలో..

  1. పంచకర్ల రమేశ్ (ఉమ్మడి విశాఖ జిల్లా పెందుర్తి)
  2. సుందరపు విజయ్ కుమార్ (ఉమ్మడి విశాఖ జిల్లా ఎలమంచిలి)
  3. వంశీక్రిష్ణ యాదవ్ (విశాఖ దక్షిణం)
  4. బొలిశెట్టి శ్రీనివాస్ (ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం)
  5. పత్సమట్ల ధర్మరాజు (ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు)
  6. బొమ్మిడి నాయకర్ (నరసాపురం)
  7. పులపర్తి రామాంజనేయులు (భీమవరం)
  8. దేవ వరప్రసాద్ (ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు)
  9. ఆరణి శ్రీనివాసులు (తిరుపతి)
    తొలి జాబితాలో ఆరుగురు అభ్యర్థుల్ని ప్రకటించగా.. తాజాగా అభ్యర్థులుగా ఫైనల్ చేసిన వారితో స్వయంగా మాట్లాడిన పవన్ కల్యాణ్.. వారిని ఎన్నికల ప్రచారాన్ని షురూ చేయాల్సిందిగా ఆదేశించారు. ఈ నేపథ్యంలో జనసేన పోటీ చేసే మిగిలిన ఆరు స్థానాలేమిటి? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది. పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. జనసేన పోటీ చేసే మిగిలిన ఆరు నియోజకవర్గాల మీద దాదాపుగా క్లారిటీ వచ్చినట్లేనని చెబుతున్నారు.
    కాకినాడ జిల్లాలోని పిఠాపురం
    అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం
    కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురం
    విజయనగరం జిల్లాలోని పాలకొండ
    కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ
    అన్నమయ్య జిల్లాలోని రైల్వే కోడూరు లేదంటే ఏలూరు జిల్లాలోని పోలవరంలో ఏదో ఒక స్థానం నుంచి జనసేన అభ్యర్థులు బరిలోకి దిగుతారని చెబుతున్నారు.
    పొత్తులో భాగంగా ప్రకటించాల్సిన ఆరు స్థానాల్లో అభ్యర్థుల విషయానికి వస్తే.. ఒక్కోచోట ఇద్దరు ముగ్గురు చొప్పున టికెట్ ను ఆశిస్తున్నారు. వీరిలో అంతిమంగా టికెట్ ఎవరికి దక్కుతుందన్నదిఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తం ఆరు స్థానాల్లో పాలకొండ నుంచి ఎక్కువ మంది అభ్యర్థులు టికెట్ ఆశిస్తున్నారు. మొత్తంగా చూస్తే.. 21 జల్లాల్లో అత్యధికంగా ఉమ్మడి గోదావరి జిల్లాలకు చెందిన అభ్యర్థులే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. మరి.. ఈ స్థానాల్లో అభ్యర్థులు ఎవరన్న విషయంపై త్వరలోనే క్లారిటీ వస్తుందని చెబుతున్నారు.

This post was last modified on March 14, 2024 10:40 am

Share
Show comments
Published by
satya

Recent Posts

రౌడీ హీరోతో సుకుమార్ సినిమా – ఛాన్స్ ఉందా

వరస ఫెయిల్యూర్స్ తో మార్కెట్ ని రిస్క్ లో పెట్టుకున్న విజయ్ దేవరకొండకు ది ఫ్యామిలీ స్టార్ ఇచ్చిన షాక్…

3 hours ago

అనుమానపడుతూనే అనిరుధ్ మీద పొగడ్తలు

నిన్న సాయంత్రం విడుదలైన దేవర పార్ట్ 1 మొదటి ఆడియో సింగల్ ఫియర్ కు ఊహించని స్థాయిలో ఇటు ఛార్ట్…

5 hours ago

ఒంగోలులో ‘టచ్ చేసి చూడు’ అంటున్న పోలీసులు !

రవితేజ ‘టచ్ చేసి చూడు’ సినిమా గుర్తుందా ? అందులో అలజడి సృష్టిస్తున్న అల్లరిమూకలను అరికట్టేందుకు రవితేజ పోలీసులకు రౌడీ…

6 hours ago

కల్కిలో కమల్ హాసన్ షాకింగ్ నిడివి

ఇంకో ముప్పై ఏడు రోజుల్లో విడుదల కాబోతున్న కల్కి ఏడి 2898 కోసం అభిమానులే కాదు యావత్ ఇండస్ట్రీ మొత్తం…

7 hours ago

నోరు జారానా? ముద్ర‌గ‌డ అంత‌ర్మ‌థ‌నం..!

కాలు జారితే తీసుకోవ‌చ్చు. కానీ, నోరు జారితే మాత్రం తీసుకోవ‌డం క‌ష్టం. పైగా ఇది ప‌రువు, ప్ర‌తిష్ట‌ల‌కు కూడా సంబంధించిన…

7 hours ago

పోలింగ్ ఎఫెక్ట్‌: 100 మంది అరెస్టు.. 300 మందిపై ఎఫ్ ఐఆర్‌లు

ఏపీలో ఈ నెల 13న జ‌రిగిన పోలింగ్ అనంత‌రం.. ప‌ల్నాడు, తిరుప‌తి, అనంత‌పురం జిల్లాల్లో చోటు చేసు కున్న హింస‌..…

8 hours ago