పాకిస్తాన్ లో తారక్ క్రేజ్

పాకిస్థాన్ దేశంలో మన సినిమాల విషయానికి వచ్చేసరికి మాత్రం క్లాష్ లెక్కలు పూర్తిగా మారిపోతాయి. ముఖ్యంగా మన సౌత్ సినిమాలకు, అందులోనూ టాలీవుడ్ హీరోలకు కూడా అక్కడ ఊహించని స్థాయిలో ఫ్యాన్ బేస్ ఉంది. లేటెస్ట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలను పాకిస్థాన్ లో ఒక ఫ్యామిలీ సెలబ్రేట్ చేసుకున్న వీడియో వైరల్ అవుతోంది.

యూట్యూబ్ లో రియాక్షన్స్ బై సులేమాన్ అనే ఒక పాకిస్థాన్ ఛానల్ ఉంది. ఆ ఛానల్ నడిపే వ్యక్తి తన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఒకచోట చేర్చి ఎన్టీఆర్ 43వ పుట్టినరోజును సెలబ్రేట్ చేశాడు. ఒక అందమైన రెడ్ వెల్వెట్ కేక్, దాని మీద డ్రాగన్ టర్న్స్ 43 అని రాయించారు. ఇంట్లో వాళ్లంతా కలిసి హ్యాపీ బర్త్ డే అన్న అని పాడుతూ ఆ కేక్ కట్ చేసి తారక్ పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు.

ఆ వీడియో చివర్లో ఎన్టీఆర్ కు సంబంధించిన పాత సినిమాల మాంటేజ్ షాట్స్ కూడా యాడ్ చేసి ఒక పక్కా ఫ్యాన్ బాయ్ మూమెంట్ ను క్రియేట్ చేశారు. ఇక్కడ అందరి దృష్టిని ఆకర్షించిన మరో ముఖ్యమైన విషయం ఆ కేక్ మీద డ్రాగన్ అని రాయించడం. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా గ్లింప్స్ రీసెంట్ గానే విడుదలైంది. ఆ చిన్న వీడియో కట్ పాకిస్థాన్ ప్రేక్షకులకు కూడా విపరీతంగా కనెక్ట్ అయింది.

సినిమాలోని డార్క్ మాఫియా కాన్సెప్ట్, అలాగే లుగర్ క్యారెక్టర్ లో ఎన్టీఆర్ లుక్ వాళ్లకు కనెక్ట్ కావడంతో టైటిల్ ని కేక్ మీద వేయించి సెలబ్రేట్ చేసుకున్నారు. దీన్ని బట్టి ప్రశాంత్ నీల్ క్రియేట్ చేసిన ఆ మాస్ ప్రపంచానికి సరిహద్దులు లేవని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.

అసలు పాకిస్థాన్ లో మన హీరోలకు ఇంత ఫాలోయింగ్ ఎలా వచ్చింది అనేది చూస్తే.. దానికి ప్రధాన కారణం మన టాలీవుడ్ మార్క్ మాస్ కంటెంట్. మన సినిమాల్లో ఉండే యాక్షన్, ఎమోషన్, పవర్ ఫుల్ ఎలివేషన్స్ కు అక్కడి యూత్ బాగా కనెక్ట్ అయ్యారు.

హిందీలో డబ్ అయ్యే మన సినిమాల కోసం కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. దానికి తోడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో తారక్ క్రేజ్ గ్లోబల్ లెవెల్ కి వెళ్ళిపోయింది. కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ పండించిన ఎమోషన్ కు దాయాది దేశం వాళ్లు కూడా ఫిదా అయిపోయారు. ఆ ఇష్టం కాస్తా ఇప్పుడు డ్రాగన్ సినిమాతో మరింత స్ట్రాంగ్ గా మారుతోంది.