మిత్రపక్షాల సీట్ల పంపకంలో జనసేనకు మరో మూడు అసెంబ్లీ, ఒక పార్లమెంటు సీటు త్యాగం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీనిపై తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సీట్లు పంపకం జరిగిందని పేర్కొ న్నారు. “పోటీ చేస్తామా.. చేయమా? అనే స్థాయి నుంచి ఇప్పుడు పోటీ చేసేందుకు రెడీ అయ్యాం. సీట్ల సంఖ్య.. హెచ్చు తగ్గుల కంటే రాష్ట్ర శ్రేయస్సు ముఖ్యమని మూడు పార్టీలు ధృడ సంకల్పంతో ముందడుగు వేశాయి“ అని పవన్ ట్విటర్ వేదికగా వెల్లడించారు.
‘‘గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శక్తిమంతమైన, దార్శనిక నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగనున్న లోక్ సభ, శాసనసభ ఎన్నికల్లో బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలసి పని చేస్తాయి.“ అని పవన్ పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రగతి, ప్రజల స్థితిగతుల మెరుగుదలకు మూడు పార్టీలు కట్టుబడి ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సీట్లు పంపకం జరిగిందని తెలిపారు.. సీట్ల సంఖ్య.. హెచ్చుతగ్గుల కంటే రాష్ట్ర శ్రేయస్సు ముఖ్యమని భావించినట్టు పేర్కొన్నారు.
మూడు పార్టీలు ధృడ సంకల్పంతో ముందడుగు వేశాయన్నారు. ఈ కూటమి ఆవిర్భావంతో రాష్ట్ర పురోభి వృద్ధికి ఒక బలమైన పునాదిపడిందని తమ ప్రగాఢ విశ్వాసమని పవన్ వ్యాఖ్యానించారు. ఎన్డీఏ. భాగస్వా ములుగా రాష్ట్ర ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటామన్నారు. సీట్లపై చర్చల్లో పా ల్గొన్న కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు బైజయంత్ పాండా, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు అని పవన్ వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates