3 రాజధానుల పై జగన్ కు లైన్ క్లియర్

ఏపీలో రాజధాని విషయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని, దీనికి కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం గతంలోనే కేంద్రం హోం శాఖ తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. రాష్ట్ర రాజధాని అంశంతో కేంద్రానికి సంబంధం లేదని హైకోర్టుకు కేంద్ర హోం శాఖ రెండు సార్లు సమర్పించిన అఫిడవిట్ లలో స్పష్టం చేసింది. అయితే, విభజన చట్టం ప్రకారం ఒకే రాజధాని ఉండాలని, మూడు రాజధానులు కాదని దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరుగుతోంది.

ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి ఏపీ రాజధాని అంశంపై కేంద్ర హోం శాఖ మరింత స్పష్టతనిచ్చింది. ఏపీలో రాజధాని, విభజన చట్టంలో రాజధాని అంశం గురించి క్లారిటీ ఇస్తూ కేంద్రం హోం శాఖ మూడోసారి హైకోర్టులో అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. విభజన చట్టంలో ఒకే రాజధాని ఉండాలని ఎక్కడా లేదని స్పష్టం చేసింది.

ఏపీలో 3 రాజధానుల అంశంపై కేంద్ర హోంశాఖ మరోసారి స్పందించింది. రాజధాని అంశంలో కేంద్రం జోక్యం ఉండబోదని, 3 రాజధానుల్లో కేంద్రం పాత్రపై మరింత క్లారిటీ ఇచ్చింది. విభజన చట్టంలో ఒకే రాజధాని ఉండాలని ఎక్కడా లేదని, రాజధాని పై రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయమని మరోమారు స్పష్టం చేసింది. 3 రాజధానులు ఉండాలన్న రాష్ట్ర నిర్ణయంలో కేంద్రం తలదూర్చదని తేల్చి చెప్పింది.

3 రాజధానుల అంశంలో కేంద్రం పాత్రపై పిటిషనర్‌ దోనే సాంబశివరావువి కేవలం అపోహలేనని హోంశాఖ క్లారిటీ ఇచ్చింది. ఏపీ రాజధానికి అవసరమైన ఆర్థిక సాయం చేస్తామని మాత్రమే కేంద్రం చెప్పిందని స్పష్టం చేసింది. తాజాగా మూడోసారి కేంద్రం అఫిడవిట్ దాఖలు చేయడంతో మూడు రాజధానులపై కేంద్రానికి ఎటువంటి అభ్యంతరం లేదన్న వషయం మరోసారి స్పష్టమైంది.