డబుల్ జెయింట్ కిల్లరేనా ?

మామూలుగా అతిపెద్ద ప్రత్యర్ధిని ఓడించిన అభ్యర్ధిని జెయింట్ కిల్లర్ అని అనటం అందరికీ తెలిసిందే. అదే ఒకేసారి ఇద్దరు అతిపెద్ద ప్రత్యర్ధులను చిత్తుచేసిన అభ్యర్ధిని ఏమనాలి ? డబుల్ జెయింట్ కిల్లర్ అని పిలవాలేమో. ఇదంతా ఎవరి విషయంలో అంటే కామారెడ్డి నియోజకవర్గంలోని వెంకటరమణారెడ్డి విషయంలోనే. నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి నియోజకవర్గం మొదటినుండి జనాల దృష్టిని ఆకర్షిస్తునే ఉంది. ఎందుకంటే ఇక్కడ కేసీయార్ పోటీచేయటమే కారణం.

ఎప్పుడైతే కేసీయార్ పోటీలోకి దిగారో వెంటనే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా పోటీచేస్తున్నట్లు ప్రకటించారు. అంటే కామారెడ్డిలో ఒక ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు పోటీచేస్తున్న నియోజకవర్గం కాబట్టే 119 నియోజకవర్గంలో ఇదే చాలా చాలా ప్రత్యేకంగా నిలిచింది. ఇద్దరు బలమైన ప్రత్యర్ధులు పోటీపడిన ఈ నియోజకవర్గంలో బీజేపీ తరపున కాటిపల్లి వెంకటరమణారెడ్డి రంగంలోకి దిగారు. మొదటినుండి కేసీయార్, రేవంత్ కారణంగానే కామారెడ్డి ఎప్పుడూ హైలైట్ అవుతునే ఉంది. అయితే రమణారెడ్డి మాత్రం తనపని తాను చాపకింద నీరులాగ తనపని తాను చేసుకుపోతునే ఉన్నారు.

తీరా ఆదివారం కౌంటింగ్ మొదలైన దగ్గర నుండి ఒక విషయం కన్ఫర్మ్ అయిపోయింది. అదేమిటంటే మొదటి ప్లేసులో రేవంత్, రమణారెడ్డి మధ్యే దోబూచులాడింది. కేసీయార్ స్ధానం మాత్రం థర్డ్ ప్లేసు దాటలేదు. చివరకు ఆదివారం సాయంత్రానికి ఫైనల్ రిజల్టు ఏమిటంటే కేసీయార్ అనూహ్యంగా పుంజుకుని థర్డ్ ప్లేసులో నుండి సెకండ్ ప్లేసులోకి వచ్చారు. రెండో ప్లేసులో ఉన్న రేవంత్ థర్డ్ ప్లేసులోకి వెళ్ళిపోయారు. అంటే రమణారెడ్డి గెలిచారు. కేసీయార్ పైన రమణారెడ్డి 6,741 ఓట్ల మెజారిటీతో గెలిచారు.

ఇటు కేసీయార్ అటు రేవంత్ ఇద్దరినీ ఓడించారు కాబట్టే రమణారెడ్డిని డబుల్ జెయింట్ కిల్లరంటున్నారు జనాలు. రమణారెడ్డికి ఉన్న మంచిపేరు, కేసీయార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన పోరాటాలు, ఆర్ధికదన్ను, లోకల్-నాన్ లోకల్ పీలింగ్ అన్నీ కలిసి రమణారెడ్డిని విజేతగా నిలిపాయి. రమణారెడ్డి గెలుపు తెలంగాణా రాజకీయాల్లో చిరస్ధాయిగా నిలిచిపోతుందనటంలో సందేహంలేదు. అందుకనే ఈయన డబుల్ జెయింట్ కిల్లరయ్యారు.