కేసీయార్ ఎప్పుడేమి చేస్తారో ? ఎవరిని దూరంపెడతారు ? ఎవరిని దగ్గరకు తీసుకుంటారో ఎవరికీ అర్ధంకాదు. హోలు మొత్తంమీద అర్ధమవుతున్నది ఏమిటంటే ఏ పనిచేసినా, చేయకపోయినా తనకు లాభం ఏమిటన్నది మాత్రమే చూసుకుంటారని. ఇపుడు ఇదంతా ఎందుకంటే చిన్నజియ్యర్ తో సడెన్ గా సయోధ్య చేసుకున్నారు. చిన్నజియ్యర్ ను దూరంగా పెట్టేసి చాలాకాలమైంది. జియ్యర్ మొహం చూడటానికి కూడా కేసీయార్ ఇష్టపడలేదు.
ఆమధ్య ఎప్పుడు ముచ్చింతల్ లో జరిగిన సమతామూర్తి విగ్రహావిష్కరణలో వీళ్ళిద్దరికి చెడింది. నరేంద్రమోడీ హాజరైన ఆ ప్రోగ్రామ్ కు కేసీయార్ వెళ్ళలేదు. అప్పటినుండి ఇద్దరి మధ్య వ్యవహారం చెడిపోయి కేసీయార్ పూర్తిగా దూరంగా ఉంటున్నారు. అలాంటిది ఇపుడు సడెన్ గా ఎందుకని మళ్ళీ దగ్గరవుదామని అనుకుంటున్నారు. వచ్చేనెల 4వ తేదీన పాలకుర్తి పరిధిలోని వల్మిడి గ్రామంలో జరగబోయే ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఇద్దరు కలవబోతున్నారు.
ఇంత సడెన్ గా జియ్యర్ తో కలిసి తాను కూడా కార్యక్రమంలో పాల్గొనటానికి రెడీ అయ్యారంటేనే ఇద్దరి మధ్య సయోధ్య జరిగినట్లు అర్ధమైపోతోంది. ఇంత సడన్ గా ఎందుకంటే రాబోయే ఎన్నికల కోసమే అని అర్ధమైపోతోంది. హిందు ఓట్ల కోసమే చిన్నజియ్యర్ తో కేసీయార్ సయోధ్య చేసుకున్నారని తెలుస్తోంది. చిన్నజియ్యర్ చేసే ప్రవచనాలకు, హాజరయ్యే కార్యక్రమాలకు హిందువుల్లో పెద్దఎత్తున ఆధరణ కనబడుతుంటుంది. భక్తుల్లో జియ్యర్ అంటే అపరామైన గైరవం, భక్తి ఉందని అందరికీ తెలిసిందే.
దీన్ని అడ్వాంటేజ్ తీసుకుని రాబోయే ఎన్నికల్లో లబ్దిపొందాలన్నది కేసీయార్ ఆలోచన. అయితే కేసీయార్ ఆలోచన ఎంతవరకు వర్కవుటవుతుందో తెలీదు. ఎందుకంటే ఎంతో స్నేహంగా ఉండే కేసీయార్-చిన్నజియ్యర్ మధ్య చెడింది. ఎప్పుడైతే కేసీయార్ తో వ్యవహారం చెడిందో సమతామూర్తి ప్రాజెక్టు దెబ్బతినేసింది. అప్పటినుండి చిన్నజయ్యర్ కు కూడా బాగా మండుతోంది. ఆధ్యత్మిక వేత్త కాబట్టి ఎక్కడా బయటపడలేదు. అలాంటిది తనవసరాల కోసం ఇప్పుడు కేసీయార్ దగ్గరకు వస్తున్న సమయంలో చిన్నజియ్యర్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది. మరీ సయోధ్య కేసీయార్ కు ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాల్సిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates