తనపై పోటీ చేయాలంటూ పవన్ కు ఎంపీ సవాల్

వైసిపి ఎంపీ ఎంవీవీ సత్యనారాయణపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ప్రజలు గెలిపించిన ఎంపీ విశాఖలో భద్రత లేదని భయపడి హైదరాబాద్ కు పారిపోతాను అంటున్నాడని పవన్ ఎద్దేవా చేశారు. రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని, ఆ ఎంపీకి హితవు పలికారు. ఇక చర్చి భూములను ఎంవివి సత్యనారాయణ కబ్జా చేశారని పవన్ సంచలన ఆరోపణ చేశారు. ఈ నేపథ్యంలోనే పవన్ వ్యాఖ్యలపై ఎంపీ ఎంవీవీ స్పందించారు.

పవన్ మగాడు అయితే 175 సీట్లలో పోటీ చేయాలని, తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ చేశారు. వీధి రౌడీకి, పవన్ కు పెద్ద తేడా లేదని షాకింగ్ ఆరోపణలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రాన్ని పవన్ ఎందుకు ప్రశ్నించరని ఆయన నిలదీశారు. సినిమాలు లేకపోతే అడుక్కోవడానికి కూడా పవన్ పనికిరాడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేని పిరికిపంద పవన్ అని విమర్శలు గుప్పించారు.

గాజువాకలో తుక్కుతుక్కుగా ఓడిపోయిన పవన్ తన గురించి మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. అనుమతులు, వ్యవస్థపై పవన్ కు కనీస అవగాహన లేదని, అటువంటి ఆయన రాష్ట్రాన్ని పరిపాలిస్తానని చెబుతున్నాడని ఎద్దేవా చేశారు. పవన్ కంటే కేఏ పాల్ 100% బెటర్ అని సెటైర్లు వేశారు. కాపుల ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టి చంద్రబాబు బూట్లు పవన్ నాకుతున్నారని, పవన్ కు సిగ్గు లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

పవన్ ఆవేశం స్పీచ్ లో కాదని పోటీ చేసి చూపించాలని సవాల్ విసిరారు. పవన్ ది మనిషి జన్మేనా అని ప్రశ్నించారు. కాజా దగ్గర పవన్ 50 కోట్ల విలువైన భూమిని తక్కువకు కొంటే అది నీతి అని, కష్టపడి వ్యాపారాలు చేసి తాను సంపాదిస్తే అవినీతి అని పవన్ అంటున్నారని చురకలంటించారు. పవన్ ను సీఎం అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటిస్తే తామంతా ఆయనకు మద్దతు ఇస్తామని షాకింగ్ కామెంట్స్ చేశారు. కుక్క మొరిగినట్లు పవన్ మొరుగుతున్నానని, అందుకే సమాధానం ఇస్తున్నామని చెప్పారు.