బిగ్ బ్రేకింగ్ – రాజధాని తరలింపు వాయిదా

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల కల మరోసారి వాయిదా పడింది. కోర్టుల్లో కేసులు కొనసాగుతున్న నేపథ్యంలో మరీ ఈ 16వ తేదీ కి విశాఖపట్నంలో రాజధాని పనులు ప్రారంభించడం గాని, తరలించడం గాని దాదాపు అసాధ్యం అని నిశ్చయించుకున్న ఏపీ సర్కారు దీనిపై ఒకడుగు వెనక్కు వేసింది. విశాఖలో పరిపాలన రాజధాని శంకుస్థాపన అధికారికంగా వాయిదా పడింది.

సుప్రీం, హైకోర్టుల్లో కేసులుండటం… వాటిలోవాదోపవాదాలు, వాయిదాల నేపథ్యంలో అనుకున్నంత వేగంగా ఈ కేసు తేలే అవకాశం లేదని గమనించిన ప్రభుత్వం కొంచెం దూరంగా ముహుర్తం పెట్టుకుంది. రాబోయే విజయదశమికి ముహూర్తం ఖరారు.

కోర్టుల్లో కేసులుంటే ప్రధాని నరేంద్రమోడీని కూడా ఆహ్వానించలేమని, అందుకే క్లియరెన్స్ వచ్చాకే ముందుకు పోదామని ప్రభుత్వం భావిస్తున్నట్లు అర్థమవుతోంది.

కరోనా నేపథ్యంలో కూడా రాజధాని తరలింపును కోర్టు తాత్కాలికంగా ప్రశ్నించొచ్చని కూడా ముఖ్యమంత్రికి సలహా అందినట్లు తెలుస్తోంది.