Political News

ఒక్కడినీ వదిలి పెట్టను.. అమెరికాలో ఉన్నా లోపలేస్తా

 టీడీపీ కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కడినీ వదిలి పెట్టను.. అమలాపురంలో ఉన్నా అమెరికా పారిపోయినా పట్టుకొచ్చి లోపలేస్తామని టీడీపీ యువ నేత‌, జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్‌ హెచ్చరించారు. మ‌హానాడులో రెండో రోజు ఆయ‌న గంభీరంగా ప్ర‌సంగించారు. రాజమహేంద్రవరం పేరులోనే రాజసం ఉందని అన్నారు. గోదావరి నీరులాగే ఇక్కడివారి మనసులు కూడా స్వచ్ఛంగా ఉంటాయని ప్రశంసించారు. కష్టం వస్తే ప్రజల కన్నీరు తుడిచింది.. బడుగువర్గాలకు రాజకీయ ప్రవేశం కల్పించింది.. ఎన్టీఆర్‌ అని కొనియాడారు. ఏపీని ప్రపంచ పటంలో పెట్టింది.. మన చంద్రన్న అని నారా లోకేష్‌ తెలిపారు.  

ఎన్నో పరిశ్రమలు తెచ్చి అభివృద్ధి అంటే ఏమిటో చంద్రబాబు చేసి చూపించారని  లోకేష్ అన్నారు. టీడీపీ.. ఘన చరిత్ర ఉన్న పార్టీ అని.. వైసీపీ అంటే గలీజు పార్టీ అని మండిపడ్డారు. చంద్రన్నది అభివృద్ధి బాట.. జగన్‌ది అవినీతి బాట అని విమర్శించారు. ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి సైకోగా మారారని.. నాలుగేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని మండిపడ్డారు. లక్ష కోట్లు ఆస్తి ఉన్నవాడు పేదవాడా అని లోకేశ్ ప్రశ్నించారు. లక్ష రూపాయల చెప్పులు వేసుకునే వాడు పేదవాడా అని నిలదీశారు. వెయ్యి రూపాయల వాటర్ బాటిల్ తాగేవాడు పేదవాడా అని  లోకేష్‌ ధ్వజమెత్తారు.  

కరెంట్‌, ఆర్టీసీ ఛార్జీలు పెంచి బాదుడే బాదుడు చేపట్టారని.. కరెంట్‌ బిల్లులు, ఆర్టీసీ టికెట్లపై జగన్‌ తన ఫోటో ముద్రించాలని  లోకేష్ పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వంలో కట్టిన టిడ్కో ఇళ్లకు.. వైసీపీ ప్రభుత్వంలో రంగులు వేస్తున్నారని ఎద్దేవా చేశారు. పేదలకు సెంటు స్థలం ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారని.. పేదల ఇళ్ల స్థలాల పేరుతో 7 వేల కోట్ల రూపాయలను లూటీ చేశారని ఆరోపించారు. ఇళ్లు కట్టుకునే స్తోమత పేదలకు ఉంటుందా అని ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కడినీ వదిలి పెట్టను.. అమలాపురంలో ఉన్నా అమెరికా పారిపోయినా పట్టుకొచ్చి లోపలేస్తామని  లోకేష్‌ హెచ్చరించారు.

పోరాటం మన పసుపు సైన్యం బ్లడ్లో ఉందన్న  లోకేష్‌.. పోరాడిన ప్రతి కార్యకర్త బాధ్యత తనదని హామీ ఇచ్చారు. పేదలు ఎప్పటికీ పేదరికంలో ఉండాలి అనేది సైకో జగన్ కోరిక అని మండిపడ్డారు. పేదరికం లేని రాష్ట్రం చూడాలి అన్నది మీ లోకేశ్ ఎజెండా అని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ పేరు చెబితే పౌరుషం, పసుపు జెండా చూస్తే పూనకం వస్తుందన్నారు. వైసీపీ పాలనలో యువత, మహిళలు, కార్మికులు, ఉద్యోగులంతా బాధ పడుతున్నారని.. ఉద్యోగాలు లేక యువత పక్క రాష్ట్రాలకు తరలివెళ్తున్నారని విమర్శించారు.

తన పాదయాత్రలో రాయలసీమ ప్రజల కష్టాలు చూశానని నారా లోకేశ్‌ చెప్పారు. తమ పాదయాత్రను అడ్డుకునేందుకు రాజారెడ్డి రాజ్యాంగం ప్రయోగించారని.. అంబేడ్కర్‌ రాజ్యాంగంతో ఈ ప్రభుత్వానికి జవాబు చెప్పానని   లోకేష్ తెలియజేశారు. టీడీపీ కార్యకర్తలను ఇబ్బందిపెట్టిన ఎవరినీ వదిలిపెట్టన్న  లోకేష్‌.. పెద్దపెద్ద సైకోలను ఎదిరించిన ఘనత టీడీపీది అని నారా  లోకేష్ తెలిపారు.  

This post was last modified on May 29, 2023 9:42 am

Share

Recent Posts

ముఖ్యమంత్రి పదవికి దీప్కే రాజీనామా

అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…

44 minutes ago

కొండా సురేఖకు కేబినెట్ హోదా?

తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…

2 hours ago

ఇరుముడి న‌టుడు… రోజుకు 40 వేలు

హీరో హీరోయిన్ల‌కు.. పెద్ద టెక్నీషియ‌న్ల‌కు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోష‌కాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్ట‌ర్లు చేసేవాళ్ల‌కు…

3 hours ago

నాలుగు స్థంభాలాటలో విజేత ఎవరంట

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…

4 hours ago

కీర్తి సురేష్ ఇంత హాటైపోయిందేంటబ్బా..

మామూలుగా స్టార్ హీరోయిన్ల నుంచి కెరీర్ ఆరంభంలో గ్లామర్ మోతాదు ఎక్కువ ఉంటుంది. క్రమంగా గ్లామర్ పాత్రలు తగ్గించుకుని, పెర్ఫామెన్స్…

4 hours ago

ట్రైలర్ లేకుండా సినిమా… వాటి రిజల్ట్ తెలుసా?

నేచురల్ స్టార్ నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కి, భారీ అంచనాలతో రాబోతున్న సినిమా.. ది ప్యారడైజ్. ఏకంగా రూ.200…

5 hours ago