ఒకవైపు మహానాడు జరుగుతోంది. ఇది తెలుగు దేశం పార్టీకి అత్యంత కీలకమైన పండుగలాంటి సంబరం. ప్రతి రెండేళ్లకు ఒకసారి నిర్వహించే ఈ కార్యక్రమాన్ని కొన్నాళ్లుగా.. ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు. దీంతో ఈ కార్యక్రమానికి అంగరంగవైభవంగా ఏర్పాట్లు చేశారు. పైగా వచ్చేది ఎన్నికల నామ సంవత్సరం కావడంతో మరింతగా ఈ మహానాడుకు ప్రాధాన్యం ఏర్పడింది. దీంతో ఎక్కడెక్కడి నుంచో నాయకులు ఈ కార్యక్రమా నికి తరలి వస్తున్నారు.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కడియం మండలానికి సమీపంలో వేమగిరిలో నిర్వహిస్తున్న మహానా డుకు ఎంతో మంది నాయకులు వచ్చినా.. ఒకరిద్దరుకీలక నాయకులు డుమ్మా కొట్టారు. ఈ ఏడాది రెండు రోజులు నిర్వహించాలని నిర్ణయించిన కార్యక్రమంలో తొలి రోజు.. విజయవాడ ఎంపీ కేశినేని నాని కనిపిం చలేదు. నిజానికి పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి రాలేక పోయారని అనుకుందామంటే .. అలాఏమీ లేదు.
పోనీ.. కొత్త పార్లమెంటును ప్రారంభిస్తున్నారు కాబట్టి.. ఆయన అక్కడున్నారా? అంటే.. అది కూడా లేదు. ఎందుకంటే.. మహానాడులో సాటి ఎంపీ.. శ్రీకాకుళం నాయకుడు కె. రామ్మోహన్‌నాయుడు పాల్గొన్నారు. కానీ, ఎంపీ నాని మాత్రం దూరమయ్యారు. దీనిపై టీడీపీలో పెద్ద ఎత్తున చచర్చ సాగుతోంది. అయితే.. ఇంతలోనే ఆయన ఆఫీస్ నుంచి ఒక ప్రకటన సోషల్ మీడియాలో హల్చల్ చేసింది.
పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో ఉన్న అన్నగారు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించేందుకు అనుమతి ఇవ్వాలంటూ.. ఎంపీ నాని..స్పీకర్ ఓంబిర్లాకు లేఖ రాశారు. పార్లమెంటులో ఉన్న విగ్రహానికి అన్నగారి శత జయంతిని పురస్కరించుకుని నివాళులర్పిస్తామని.. అనుమతించాలని లేఖలో కోరారు. అయితే.. దీనికి స్పీకర్ అనుమతించారా? లేదా? అనేది మాత్రం తెలియదు. కానీ.. నాని వ్యూహం మాత్రం.. మీరు ఇక్కడ మహానాడు చేసుకుంటున్నారు. నేను అక్కడ పార్లమెంటులో అన్నగారికి నివాళులర్పిస్తున్నాను అనే సంకేతాలు ఇచ్చినట్టుగా ఉందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on May 29, 2023 9:38 am
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…