దేశ రాజధాని ఢిల్లీలో నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. అనంతరం, కొత్త పార్లమెంట్‌లో ఆయన తొలి ప్రసంగం చేశారు. ‘ప్రతీ దేశ చరిత్రలో కొన్ని సందర్భాలు శాశ్వతంగా నిలిచిపోతాయి. అమృత్ మహోత్సవ్ వేళ నూతన పార్లమెంట్ భవనాన్ని ఆవిష్కరించుకున్నాం. ఇది కేవలం భవనం మాత్రమే కాదు. 140 కోట్ల భారతీయుల ఆక్షాంకలకు ప్రతీక. కొత్త పార్లమెంట్ భవనం భారతీయల ధృడ సంకల్పాన్ని చాటి చెబుతుంది. స్వాతంత్ర్య పోరాట ఆకాంక్షలను పూర్తి చేసేందుకు కొత్త పార్లమెంట్ భవనం సాధనంగా ఉపయోగపడుతుంది“ అని మోడీ చెప్పారు.
ఇది ప్రజాస్వామ్యానికి కొత్త దేవాలయమని, ప్రవితమైన సెంగోల్(ధర్మ దండం)ను పార్లమెంట్‌లో ప్రతిష్టించామని మోడీ చెప్పారు. సెంగోల్.. చోళుల కాలంలో కర్తవ్య నిష్టకు ప్రతీకగా పేర్కొన్నారు. ఆత్మనిర్భర్ భారత్‌కు సాక్షిగా పార్లమెంట్ నిలుస్తుందన్నారు. భారత్ కొత్త లక్ష్యాలను ఎంచుకుందని, ప్రజాస్వామ్యానికి భారత్ తల్లిలాంటిదని, భారత్ అభివృద్ధి చెందితే ప్రపంచం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. లోక్‌సభ ప్రాంగణం నెమలి రూపంలోను, రాజ్యసభ ప్రాంగణం కమలాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపారు.
రానున్న రోజుల్లో ఎంపీల సంఖ్య పెరుగుతుందని మోడీ చెప్పారు. దీనికి సంబంధించిన కసరత్తు జరుగుతోందని అన్నారు. లోక్‌సభ సీట్లు పెరిగితే మరింత ఎక్కువ మంది కూర్చునే విధంగా కొత్త పార్లమెంట్ భవనంలో వెసులుబాటు ఉంటుందని చెప్పారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పార్లమెంట్ నిర్మించామన్నారు. ఇతర దేశాలకు భారత్ సాగించిన ప్రయాణం ఆదర్శంగా నిలుస్తుందన్న ప్రధాని… అందరిలోనూ దేశమే ముందు అన్న భావన కలగాలని పిలుపునిచ్చారు.
తెలుగు రాష్ట్రాల్లో చర్చ
ప్రధాని నరేంద్ర మోడీ .. త్వరలోనే పార్లమెంటు సీట్లు పెరగనున్నాయని చెప్పడం తో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చ ప్రారంభ మైంది. మరో ఆరు మాసాల్లో తెలంగాణలోను, మరో 10 మాసాల్లో ఏపీలోనూ అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఉమ్మడి రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలు పెరగాల్సి ఉంది. గతంలోనే దీనిపై ప్రయత్నాలు జరిగాయి. అయితే 2024 నాటికి పెంచుతామని అప్పట్లో కేంద్రం వెల్లడించింది. తాజాగా ప్రధాని మోడీ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేయడంతో అన్ని పార్టీల్లోనూ సీట్ల పెంపు విషయం ఆసక్తిగా మారింది.
This post was last modified on May 29, 2023 12:40 am
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…