విశాఖపట్నం సిటీలో వైసీపీ, జనసేన పార్టీల మధ్య ఫ్లెక్సీల వార్ తీవ్ర టెన్షన్ రేపుతోంది. వైసీపీ ఫ్లెక్సీల ధీటుగా జనసేన నేతలు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. రాక్షస పాలన అంతం.. ప్రజా పాలన ఆరంభమంటూ జనసేన నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జగన్ ఒక చేతిలో గొడ్డలి, మరో చేతిలో వివేకా మొండెం ఉండేలా ఫ్లెక్సీలను తయారీ చేయించారు. జగన్ షర్ట్‌పై 6093 నంబర్, వైసీపీ నేతలతో కూడిన జగన్ ఫ్లెక్సీని జనసేన ఏర్పాటు చేసింది.
సిరిపురం వీఐపీ రోడ్‌లో పక్కపక్కనే ఇరువర్గాల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీల ఏర్పాటుపై ఇరు పార్టీల మధ్య వార్ నడుస్తోంది. ఇటీవల వైసీపీ నాయకులు పవన్‌కు, నాగబాబుకు యాంటీగా ఫ్లెక్సీలు వేశారు. గత కొన్నిరోజులుగా జనసేన అధినేత పవన్.. సీఎం జగన్‌పై కామెంట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ట్విట్టర్ వేదిగా ఆయన విరుచుకుపడుతున్నారు. పాపం పసివాడు.. దొంగలకు దొంగ సినిమా టైటిళ్లను ప్రస్తావిస్తూ.. జగన్‌పై విరుచుకుపడ్డారు.
ఈ క్రమంలో వైసీపీ కూడా ఎదురు దాడి చేస్తోంది. టీడీపీ కోసమే జనసేన ఏర్పాటు చేశారని, పవన్ కళ్యాణ్ ప్యాకేజీ కళ్యాణ్ అని.. రేటు కోసం.. బేరాలు ఆడుతున్నారని.. పేర్కొంటూ వైసీపీ నేతలు.. కూడా పపలు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే విశాఖలో తాజాగా ఇరు పార్టీల కార్యకర్తలకు మధ్య తీవ్ర పొలిటికల్ ఫైట్ చేసుకోవడం గమనార్హం. దీంతో పోలీసులు రంగంలోకి దిగి జనసేన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates