నెటిజన్లకు టార్గెట్ అవుతున్న లేడీ ఆఫీసర్

తెలంగాణలో మంచి అధికారిణిగా చాలాకాలంగా పేరు తెచ్చుకున్న ఐఏఎస్ స్మితాసభర్వాల్ కొంతకాలంగా నెటిజన్లకు టార్గెట్ అవుతున్నారు. ముఖ్యంగా ఆమె కేసీఆర్ ప్రభుత్వానికి భజన చేసేలా ట్వీట్లు, పోస్టులు పెట్టిన ప్రతిసారీ నెటిజన్లు తమ కామెంట్లతో ఆమెను టార్గెట్ చేస్తున్నారు. ఒకప్పుడు బీభత్సంగా అభిమానించిన నెటిజన్లే ఇప్పుడు ఆమె వైఖరిని తప్పుపడుతున్నారు. ప్రభుత్వానికి భజన చేస్తున్నారే కానీ ఇతర ముఖ్యమైన అంశాలపై ఎందుకు స్పందించడం లేదంటూ నిలదీస్తున్నారు.

తెలంగాణ సీఎంవోలో పనిచేసే ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌ రీసెంటుగా ట్విట్టర్‌లో తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా తీసిన సచివాలయం ఫొటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. వెనుక మేఘాలు గులాబీ రంగులో కనిపిస్తుండగా.. దానికి ఎలాంటి ఫిల్టర్లు వాడకుండా తీసిన ఫొటోగా ఆమె క్యాప్షన్ రాశారు.

దీంతో నెటిజన్లు ఆమెపై కామెంట్లు మొదలుపెట్టారు. ‘‘మెడికో ప్రీతి గురించి ఒక్కసారైనా పోస్ట్ పెట్టావా అక్క?.. తెలంగాణలో కుక్కలు కరిచి చిన్నపిల్లలు చనిపోతే ఒక్కసారి ఐనా స్పందించావా? నీ భజన పోస్ట్‌లా వల్ల ఎవరికి ఉపయోగం చెప్పండి ఒక కుటుంబానికి అయిన న్యాయం జరిగిందా ఈ పోస్టు వల్ల? అంటూ కామెంట్స్ చేశారు. ఇంకొకరు కామెంట్ చేస్తూ.. ఫొటోగ్రఫీ కూడా వీల్లే చేస్తే.. ఇంకా అడ్మినిస్ట్రేషన్ ఎవరు చేస్తారని కామెంట్స్ చేశారు. మరో నెటిజన్.. ‘‘ఎలా ఉండే మీరు ఎలా అయిపోయారు మేడం.. ఎంతో గౌరవం ఉండేది మీరు కూడా ఇలా భజన బ్యాచ్‌లో చేరి భజన చేస్తారు అనుకోలేదు’’ అంటూ కామెంట్స్‌తో రెచ్చిపోయారు.

మరొక కామెంట్ చేస్తూ.. ‘‘మీ పార్టీ రంగు అనే కదా మీ అర్థం… నిన్న మ్యాన్ హోల్‌లో పడి పాప చనిపోతే, కుక్కలు పిల్లల్ని చంపినప్పుడు, మెడికో ప్రీతి చనిపోయినపుడు, కూడా ఆకాశం ఇలాగే ఎరుపు రంగు చూపింది. అప్పుడు ఏమయ్యాయి మీ నో ఫిల్టర్ ఫోటోస్’’ అంటూ కామెంట్ చేశారు.

కాగా ఒకప్పుడు జిల్లాలలో కలెక్టరుగా పనిచేసినప్పుడు సమర్థురాలైన అధికారిణిగా పేరు పడిన స్మిత సభర్వాల్ సీఎంఓకు వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ భజన చేస్తున్నారని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ప్రజా సమస్యలపై స్పందించకుండా ప్రభుత్వ భజన చేస్తున్నారని అంటున్నారు. దీంతో ఆమెకు రాజకీయ ఉద్దేశాలు ఆపాదిస్తున్నారు నెటిజన్లు.