మాజీ ఉపరాష్ట్రపతి, బీజేపీ నాయకులు వెంకయ్యనాయుడును సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీ నారాయణ కలిశారు. శుక్రవారం ఉదయం..విశాఖ బీచ్ రోడ్‌లో మార్నింగ్ వాక్ కోసం.. వచ్చిన వెంకయ్యతో లక్ష్మీనారాయణ అక్కడే భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరూ.. రాగి జావ తాగారు. కొద్ది దూరం కలిసి నడిచారు. ఈ సందర్భంగా ఏపీ రాజకీయాలు.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీ కరణ వంటి అంశాలు వారి మధ్య చర్చకు వచ్చినట్టు సమాచారం.
విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో తానుచేసేది ఏమీలేదని.. కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉందని.. డెలిగేషన్‌తో వెళ్లి చర్చలు జరిపితే ప్రయోజనం ఉంటుందని ఆయన లక్ష్మీనారాయణకు సూచించినట్టు తెలిసింది. కాగా.. లక్ష్మీనారాయణ ఇప్పటికే హైకోర్టులో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఉక్కు ఫ్యాక్టరీని అమ్మితే..ప్రజలే కొనుగోలు చేసేలా.. ఆయన ఒక సూత్రాన్ని కూడా తెరమీదికి తెచ్చారు. ఆయా విషయాలను వెంకయ్యకు వివరించినట్టు సమాచారం.
ఇదిలావుంటే.. రాజకీయాల ప్రస్తావన కూడా వారిమధ్య వచ్చినట్టు సమాచారం. ఈ సందర్భంగా తాను ఒంటరిగానే విశాఖ నుంచి పోటీ చేయాలని యోచిస్తున్నట్టు లక్ష్మీనారాయణ చెప్పారని తెలిసింది. దీనికి వెంకయ్య నాయుడు స్పందిస్తూ.. మీలాంటి వారికి బీజేపీ సరైన వేదిక అవుతుందని..ఎలాంటి అవినీతి లేకుండా పాలన సాగుతోందని.. ఎంతో మంది బ్యూరోక్రాట్లు బీజేపీలో చేరి.. మంచి భవిష్యత్తు పొందుతున్నారని.. ప్రజలకు సేవ చేసే అవకాశం కూడా ఉంటుందని పేర్కొన్నట్టు సమాచారం. అయితే.. దీనిపై లక్ష్మీనారాయణ మౌనంగా నే ఉండిపోయారని తెలిసింది. మరి భవిష్యత్తులో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
This post was last modified on April 21, 2023 6:15 pm
ఏపీలోని కూటమి సర్కారు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ…
దేశంలో ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. నానాటికీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పోటీ పడి మరీ పరుగులు పెడుతుంటే… దేశ…
రామ్ గోపాల్ వర్మలో ఎప్పుడూ లేని పశ్చాత్తాప భావన చూస్తున్నాం ఇప్పుడు. ఒకప్పుడు రంగీలా, సత్య లాంటి క్లాసిక్స్ తీసిన…
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీపై ఈసారి చాలా ఆసక్తిగా మారబోతోన్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 19 నుంచి దుబాయ్, పాకిస్థాన్ వేదికలుగా…
తీవ్ర వివాదాలు ఎదురుకుంటూ విపరీతమైన వాయిదాలకు లోనవుతూ వచ్చిన ఎమర్జెన్సీ ఇటీవలే విడుదలయ్యింది. క్రిష్ వదిలేశాక మణికర్ణిక బ్యాలన్స్ పూర్తి…
కరోనా తర్వాత థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిన మాట వాస్తవం. కొవిడ్ టైంలో ఓటీటీలకు బాగా అలవాటు పడ్డాక..…