దేశంలో జూన్ భయం

కరోనా మరోసారి విజృంభించేందుకు రేడీ అవుతోంది. అక్కడక్కడా కేసులు నమోదవుతున్నాయి. అవి ఆందోళనకర స్థాయికి చేరుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రధాని మోదీ దీనిపై ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రాలకు కేంద్రం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ట్రెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ పై ఉదాసీనన వద్దని కేంద్రం సూచించింది. తమ వైపు నుంచి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చింది

గత 24 గంటల్లో దేశంలో 1,890 కరోనా కేసులు నమోదయ్యాయి. 2020 మార్చిలో కూడా ఇదే స్థాయిలో డెవలప్ అవుతూ.. జూన్ లో భారీగా పెరిగాయి. ఏకంగా రోజుకు లక్షల కేసులు నమోదయ్యాయి. సరిపడా టెస్టింగ్ పరికరాలు లేక చాలా మందికి కరోనా నిర్థారణ కాని పరిస్థితి ఏర్పడింది. తర్వాతి కాలంలో వ్యాక్సిన్ రావడం కారణంగా వైరస్ నియంత్రణకు వచ్చింది. ఇప్పటి వరకు 220 కోట్ల వ్యాక్సిన్ డోసులను వేశారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పెరిగింది.

ప్రస్తుతం రోజుకు వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. మరో వారం రోజుల్లో అది రెండు వేలకు చేరుకోవచ్చు. జూన్ మొదటి వారంలో వర్షాకాలం మొదలైతే… ఇక థర్డ్ వేవ్ భయం జనాన్ని , ప్రభుత్వాలను వెంటాడుతుంది. ప్రస్తుతం 9,433 ఉన్న కేస్ లోడ్ అప్పుడు లక్షలకు చేరుతుంది. వ్యాధి లక్షణాలను బట్టి ఖచితంగా అది కరోనానేనని చెప్పలేం. టెస్టింగ్ చేసిన తర్వాత మాత్రమే దేన్నైనా నిర్థారించే వీలుంది. అందుకే రాష్ట్రాల వైద్య శాఖలు అప్రమత్తంగా ఉండాల్సిన అనివార్యత ఏర్పడింది.

కరోనా బయట పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 92 కోట్ల టెస్టులు చేశామని కేంద్రం అంటోంది. గత 24 గంటల్లోనే లక్షా 21 వేల టెస్టులు చేశారట. అలాగని టెస్టులు సరిపోతాయా అంటే అవునని చెప్పలేని పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో టెస్టు కిట్స్ కొరత ఉంది. పట్టణ ప్రాంతాల్లో అయితే ప్రైవేటు రంగంలో టెస్టింగ్ సులభమవుతోంది. గ్రామీణ ప్రాంతాలకు అటువంటి సౌకర్యాలు లేవు. అందుకే జనం జాగ్రత్త వహించడం ఉత్తమమని చెప్పాలి. రెండు మూడు నెలల వరకు మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం లాంటివి చేస్తే థర్డ్ వేవ్ భయం నుంచి బయట పడే వీటుంటుంది..