ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ.. ఏపీ అధికార పార్టీ వైసీపీకి ఎదురుదెబ్బలు తగులుతున్నా యి. ఒక్కొక్కరుగా.. నాయకులు.. పార్టీకి దూరమవుతున్నారు. ఇటీవల నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వ్యవహారం.. కలకలం రేపింది. ఆ తర్వాత ఆనం రామనారాయణరెడ్డి కూడా అదే తరహాలో కలకలం రేపారు. ఇక, ఇప్పుడు వైసీపీకి మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు రాజీనామా చేశారు. దీంతో కీలకమైన తూర్పు గోదావరిలో వైసీపీకి పెద్ద తగిలినట్టే భావిస్తున్నారు పరిశీలకులు.
పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు ఎస్సీ నియోజకవర్గంలో కీలక నేతగా ఉన్న టీవీ రామారావు.. ఇక్కడ ఎమ్మె ల్యే గెలుపులో తనవంతు పాత్ర పోషిస్తున్నారు. గతంలో టీడీపీలో ఉన్న ఆయన 2009లో కొవ్వూరు నియోజ కవర్గంలో టీడీపీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం నిడదవోలులో జరిగిన ఓ కేసులో ఇరుక్కుని రాజకీయ ఒడుదుడుకులకు గురయ్యారు. ఈ క్రమంలో ఆయనకు మరోసారి టికెట్ లభించలేదు.
దీంతో 2014లో టీడీపీ నుంచి టికెట్ రాకపోయినా.. కొవ్వూరు నియోజకవర్గంలో కేఎస్.జవహర్‌కు మద్దతుగా ప్రచారం చేసి టీడీపీ విజయానికి కృషి చేశారు. దీంతో జవహర్.. విజయం దక్కించుకున్నారు. అయితే.. జవహర్ మంత్రి అయ్యాక తమను పట్టించుకోవడం మానేశారంటూ.. రామారావు అలిగి.. పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. దీనికిముందు 2019 ఎన్నికల్లో తనకు టీడీపీ టికెట్ వస్తుందని ఆశించారు.
కానీ, చంద్రబాబు కరుణించలేదు. దీంతో రామారావు 2019లో జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అనంతరం కొవ్వూరు నుంచి పోటీ చేసిన తానేటి వనితకు మద్దతుగా ప్రచారం చేసి ఆమె గెలుపు కోసం కృషి చేశారు. కానీ.. అక్కడ కూడా రామారావు వర్గానికి మంత్రి వనిత సహకరించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రస్తుతం వైసీపీకి రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన టీడీపీలోకి చేరనున్నట్టు రామారావు వర్గం చెబుతుండడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates