యువ‌గ‌ళంలో వంగ‌వీటి రాధా

టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ చేప‌ట్టిన యువ‌గ‌ళం పాద‌యాత్ర జోరుగా సాగుతోంది. ప్ర‌స్తుతం ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని పీలేరు నియోజ‌క‌వ‌ర్గంలో కొన‌సాగుతున్న ఈ పాద‌యాత్ర‌కు టీడీపీ నేత‌ల నుంచి మంచి స్పంద‌న వ‌స్తోంది. యువ నాయ‌కులు అంద‌రూ నారా లోకేష్‌తో క‌లిసి అడుగులు వేస్తున్నారు. తాజాగా విజ‌య‌వాడ‌కు చెందిన యువ నాయ‌కుడు, టీడీపీ నేత వంగ‌వీటి రాధా కృష్ణ కూడా నారా లోకేష్‌తో పాదాలు క‌లిపారు.

గ‌త జ‌న‌వ‌రి 27న ప్రారంభ‌మైన యువ‌గ‌ళం పాద‌యాత్ర‌.. జిల్లాలోని ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో పూర్తి చేసుకుం ది. అయితే.. నెల రోజులు దాటిపోయినప్ప‌టికీ.. ఇత‌ర జిల్లాల‌కు చెందిన యువ నాయ‌కులు పెద్ద‌గా క‌ని పించ‌లేదు. త‌మ త‌మ జిల్లాల్లో ఈ యాత్ర జ‌రిగిన‌ప్పుడు.. మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని భావించిన‌ట్టు ఆయా నేత‌లు ప్ర‌క‌టించారు. దీంతో యాత్ర జ‌రుగుతున్న జిల్లాల నుంచి మాత్ర‌మే నాయ‌కులు వ‌చ్చారు.

కానీ, తాజాగా వంగ‌వీటి రాధా పీలేరుకు చేరుకుని.. నారా లోకేష్ పాద‌యాత్ర‌కు సంఘీభావం ప్ర‌క‌టించ‌డం తోపాటు.. ఆయ‌న‌తో క‌లిసి అడుగులు వేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతుండ‌డం గ‌మ‌నార్హం. ఇదిలావుంటే.. 36 రోజులుగా సాగుతున్న యాత్ర‌కు ప్ర‌జ‌ల నుంచి మంచి రెస్పాన్స్ వ‌స్తున్న‌ట్టు టీడీపీ నేత‌లు చెబుతున్నారు. వివిధ సామాజిక వ‌ర్గాల‌కు చెందిన వారు నారా లోకేష్‌ను క‌లిసి.. స‌మ‌స్య‌లు చెప్పుకొంటున్నారు.