టీడీపీ యువ నాయకుడు.. మాజీ మంత్రి నారా లోకేష్ జనవరి 27న ప్రారంభించిన యువగళం పాదయా త్ర మరో నాలుగు రోజుల్లో నెల రోజులు పూర్తి చేసుకోనుంది. అయితే.. ఇంకా నెల రోజులు కూడా పూర్తికా కుండానే.. నారా లోకేష్ ఈ యాత్ర ద్వారా ఇప్పటి వరకు 20 పెద్ద పెద్ద హామీలనేగుప్పించారు. అది కూడా ఒక్క చిత్తూరు జిల్లాకే పరిమితం అయ్యాయి. ప్రస్తుతం లోకేష్ యాత్ర.. చిత్తూరు జిల్లాలోనే కొనసాగుతోంది. శ్రీకాళహస్తి వరకు ఆయన చేరుకున్నారు.
మరి. ఈ ఒక్క జిల్లాలోనే ఇన్ని హామీలు గుప్పిస్తే.. మరో 12 ఉమ్మడి జిల్లాల్లో ఆయన యాత్ర సాగాల్సి ఉంది. దీంతో ఈ హామీల జాబితా ఇంకెంత పెరుగుతుందో అని టీడీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా.. అందిన కాడికి హామీ ఇచ్చుకుంటూ పోతే రేపు వాటిని అమలు చేయకపోతే.. మైనస్ అయిపోమా? అనేది వీరి టాక్ ఇది .. కూడా నిజమే. గత పాదయాత్రలో జగన్. కూడా ఇలా అనేక హామీలు ఇచ్చారు. వాటిలో ఇప్పటికీ.. కొన్నింటిని అమలు చేయలేక చేతులు ఎత్తేశారు.
ఇప్పుడు కూడా లోకేష్‌కు ఈ పరిస్థితి వచ్చే అవకాశం లేకపోలేదని టీడీపీలోసీనియర్లు చెవులు కొరుక్కుం టున్నారు. పైగా.. ఇది..హామీల యాత్ర కాదనే విషయాన్ని వారు చెబుతున్నారు. యువతను పార్టీవైపు బలంగా తిప్పుకోవాలనే సంకల్పంతో చేపట్టిన యాత్రగా చెబుతున్నారు. ఈ కీలక సూత్రాన్ని విడిచిపెట్టి .. హామీలపై పడితే.. మొత్తానికే మోసం వస్తుందని అంటున్నారు.
ఇక, లోకేష్ ఇచ్చిన 20 హామీల్లో కీలకమైనవి చూస్తే..
- వడ్డెరలను ఎస్టీల్లో చేర్చడం.
- ముస్లింలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి ఒక మహిళా కాలేజీ ఏర్పాటు
- రాష్ట్రంలో ఇస్లామిక్‌బ్యాంకు ఏర్పాటు
- ముస్లింలకు మంత్రి వర్గంలో చోటు
- వృద్ధులకు పింఛన్ పెంపు
- బీడీ కార్మికులకు రుణాలు
- మహిళలకు మరిన్ని పదవులు వంటివి ఉన్నాయి. మరి ఇవి అంత తేలికగా అయ్యేవి కాదని.. సీనియర్లు చెబుతున్నారు. మరి లోకేష్ వ్యూహం ఏంటో చూడాలి.