కొందరి నోటి నుంచి కొన్ని మాటలు వచ్చాయంటే.. అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. దేశంలో చాలామందే స్వాములోళ్లు ఉన్నారు. ఇక.. తెలుగు రాష్ట్రాల్లో చెప్పాల్సిన అవసరం లేదు. కానీ.. వీరిలోనూ వీవీఐపీ స్వాములోళ్లు ఉన్నారు. అలాంటి వారిలో కొందరికి ఉండే ఇమేజ్ వేరుగా ఉంటుంది. ఆ కోవలోకే వస్తారు శంకరాచార్య జ్యోతిష్య పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి.
అయోధ్యలో రామమందిరం భూమిపూజ కోసం పెట్టిన ముహుర్తం సరైనది కాదని ఆయన పేర్కొన్నారు. దీంతో.. ఇప్పటివరకూ ఎవరూ లేవనెత్తని అంశాన్ని ప్రస్తావించటం హాట్ టాపిక్ గా మారింది. దశాబ్దాల తరబడి ఇలాంటి సమయం కోసం ఎదురుచూస్తున్నప్పుడు.. ముహుర్తం విషయంలో తప్పులు దొర్లుతాయా? అన్నది ఇప్పుడు ప్రశ్న. అలా అని ఊరికే వదిలేసే పరిస్థితి కూడా కాదు. ఎవరి వాదనలో ఏమున్నదన్నది ముఖ్యమైన అంశం.
అయోధ్యలో రామాలయాన్ని నిర్మించే విషయంలో ఎన్నో హిందూ సంస్థలు.. స్వాములు భాగస్వామ్యమై ఉన్నారు. అలాంటి వారు మహుర్తాల గురించి చాలానే ఆలోచించి ఉంటారు. మరి.. వారు మిస్ అయిన అంశం ఏమైనా ఉందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. భూమిపూజ శుభఘడియల్లో జరగాలని.. అందుకోసం సరైన తేదీ.. సమయం ఎంచుకోవాలని ఆయన చెబుతున్నారు. అయోధ్యలో రామమందిరం భూమిపూజ కోసం పెట్టిన ముహుర్తం సరైనది కాదన్నది ఆయన అభిప్రాయం.
రామ మందిరాన్ని ఎవరునిర్మించినా సంతోషిస్తామని.. అందులోఎలాంటి రాజకీయం లేదన్న స్వాములోరు.. ఆలయ నిర్మాణం సక్రమంగా జరగాలననదే తమ అభిమతంగా పేర్కొన్నారు.
ప్రస్తుతం భూమిపూజ కోసం నిర్ణయించిన ముహుర్తం ఏ మాత్రం మంచిది కాదంటున్నారు. భూమిపూజ శుభఘడియల్లో జరగాలని ఆయన కోరుతున్నారు. ఇప్పటికే నిర్ణయించిన దాని ప్రకారం ఆగస్టు ఐదున ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం 1.10 గంటల వరకు నిర్ణయించారు. ఈ ముహుర్తం మీద అభ్యంతరం వ్యక్తం చేస్తున్న స్వాములోరి మాటలపై పలువురికి కొత్త సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయం మీద మిగిలిన స్వాములు స్పందించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates