చూడు.. ఒక్క‌వైపే చూడు.. జ‌గ‌న‌న్నే క‌నిపిస్తాడు!

చూడు.. ఒక్క‌వైపే చూడు.. అన్న సినిమా డైలాగు ఏపీలో బాగానే ప‌నిచేస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కు లు. ఏపీలో ఇప్పుడు ఎటు చూసినా.. ఈ డైలాగే వినిపిస్తోంది. ఎందుకంటే.. ఏ మూల చూసినా… జ‌గ‌న్ జ‌ప‌మే. ఎటు వైపు తిరిగినా.. జ‌గ‌న్ నామ‌స్మ‌ర‌ణే వినిపిస్తోంది. ఆయ‌న ఫోటోలే క‌నిపిస్తున్నాయి. దీంతో జ‌గ‌న్..మాత్ర‌మే క‌నిపించాలి.. జ‌గ‌న్ పేరు మాత్ర‌మే వినిపించాలి.. జ‌గ‌న్ గురించే చ‌ర్చించాలి.. అనే విధంగా ప‌రిస్థితి మారిపోయింది.

రాజ‌కీయాలైనా ప్ర‌భుత్వ విభాగాలైనా ముఖ్య‌మంత్రిగా ఉన్న వ్య‌క్తి ఇంపార్టెంటే. కానీ, అదేస‌మ‌యంలో క్షేత్ర‌స్థాయి నాయ‌కులు.. అదేవిధంగా ఆయా ప్ర‌భుత్వ విభాగాల హెడ్స్ కూడా ముఖ్య‌మే. దీంతో వారు కూడా త‌మ‌కు గుర్తింపు రావాల‌ని కోరుకుంటారు. ఈ నేప‌థ్యంలో క్షేత్ర‌స్థాయి పార్టీ కార్యాల‌యాల్లో అయితే.. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల ఎమ్మెల్యేలు, లేదా ఎంపీల ఫొటోల‌ను పెట్టుకుంటారు.

ఇక‌, రాష్ట్ర‌ ప్ర‌భుత్వ ఆఫీసులు అయితే.. ముఖ్య‌మంత్రి ఫొటోతోపాటు.. ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, లేదా.. డీజీపీ ఫొటోలు ఏర్పాటు చేసుకుంటారు. ఇది స‌హ‌జం కూడా. ఇక‌, కేంద్ర ప్ర‌భుత్వ కార్యాల‌యాలైతే.. ప్ర‌ధాని ఫొటోలు ఉంటాయి. ఇది రివాజు కూడా. అయితే.. ఏపీలో ప‌రిస్థితి మారిపోయింది.రాష్ట్ర ప్ర‌భుత్వ కార్యాల‌యాలైతే.. కేవ‌లం సీఎం జ‌గ‌న్ ఫొటో త‌ప్ప ఇంకేమీ క‌నిపించ‌రాద‌నే ఉత్త‌ర్వులు మౌఖికంగా ఇచ్చార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

అదేస‌మ‌యంలో పార్టీ కార్యాల‌యాల్లోనూ.. జ‌గ‌న్ ఫ్రేము మాత్ర‌మే క‌నిపించేలా ఏర్పాటు చేయాల‌ని.. కూడా పార్టీ త‌ర‌ఫున కీల‌క‌స‌ల‌హాదారు ఆదేశాలు ఇచ్చార‌ని.. పార్టీలో చ‌ర్చ సాగుతోంది. అయితే.. పార్టీ కార్యా ల‌యాల‌కు ఖ‌ర్చు పెట్టేది.. సొంత పార్టీ నేత‌లేన‌ని.. వారి ఫొటో పెట్టుకుంటే త‌ప్పులేదని ఒక వాద‌న తెర మీదికి వ‌చ్చింది.
ఈనేప‌థ్యంలో ఇలాంటి నేత‌ల ఫొటోలను పెట్టుకోవ‌చ్చ‌ని.. కానీ, సీఎం జ‌గ‌న్ ఫొటో సైజు మాత్రం పెద్ద‌దిగా ఉండాల‌ని ఆదేశించార‌ట‌. అంటే.. ఇక.. ఎటు చూసినా.. ఎక్క‌డ చూసినా.. జ‌గ‌న్ మాత్ర‌మే క‌నిపిస్తార‌న్న మాట‌. ఇదీ.. సంగ‌తి!!