ఈ మధ్య కాలంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఇమేజ్‌ను దెబ్బ తీయడానికి ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేయని ప్రయత్నం లేదు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి తమ ఓటమికి కారణమయ్యాడని అప్పట్నుంచే పవన్ మీద వైకాపా అధినేత జగన్ తీవ్రమైన ఆగ్రహంతో ఉండగా.. 2024 ఎన్నికల్లో మళ్లీ తెలుగుదేశంతో పవన్ జట్టు కట్టే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తుండడంతో వైకాపా నేతలు ఆయన్ని మరింతగా టార్గెట్ చేస్తున్నారు.
తరచుగా పవన్ మూడు పెళ్ళిళ్ళ గురించి ప్రస్తావించి ఆయన్ని డీగ్రేడ్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు వైకాపా నేతలు. అలాగే పవన్ ప్యాకేజీ తీసుకుని చంద్రబాబుకు సపోర్ట్ చేస్తున్నాడని కూుడా ఆరోపిస్తుంటారు. ఐతే ఎప్పుడూ అవే ఆరోపణలు తిప్పి తిప్పి కొడుతుంటే జనాలకు కూడా మొహం మొత్తేసి లైట్ తీసుకుంటున్నారు.
అందుకే వ్యూహం మార్చి ఇంకో రకంగా పవన్ ఇమేజ్‌ను దెబ్బ తీసే ప్రయత్నం మొదలుపెట్టినట్లు కనిపిస్తోంది. పవన్ మీద తీవ్రంగా విమర్శలు చేసే వైకాపా నేతల్లో ఒకరైన దాడిశెట్టి రాజా.. పవన్ మీద హవాలా ఆరోపణలు చేయడం గమనార్హం. పవన్ కళ్యాణ్ ఏకంగా రూ.1800 కోట్ల రూపాయలు పోలెండ్ దేశానికి హవాలా చేస్తూ దొరికిపోయాడట. పవన్‌కు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు కేంద్రం చేతికి చిక్కాయట. రెండు మూడు నెలలుగా దీని గురించి తెగ ప్రచారం జరిగిపోతోందట. ఈ విషయాన్ని ప్రెస్ మీట్లో చాలా ధీమాగా ఆరోపించేశాడు దాడిశెట్టి రాజా.
కానీ పవన్ క్యారెక్టర్ ఏంటో జనాలకు తెలుసు. వ్యక్తిగత అవసరాలు, పార్టీ ఫండ్ కోసం తనకు పెద్దగా టైం లేకున్నా కష్టపడి సినిమాలు చేస్తున్న పవన్ మీద అవినీతి ఆరోపణలు కూడా అది కూడా హవాలా అలిగేషన్స్ చేయడం జనాలకు విడ్డూరంగా అనిపిస్తోంది. ఈ ఆరోపణలను జనాలు కామెడీగా తీసుకుంటున్నారు. ప్రతిగా జనసైనికులు రాజాను సోషల్ మీడియాలో మామూలుగా టార్గెట్ చేయట్లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates