తండ్రి కాంగ్రెస్‌లో ఉన్నాడు. అంతేకాదు.. తరచుగా ఆయన రాజకీయ సుద్దులు కూడా చెబుతుంటాడు. రాజకీయాలు నాశనం అయిపోయాయని కూడా అంటూ ఉంటాడు. కానీ, ఆయన సైలెంట్‌గా తన కుమారుడిని మాత్రం టీడీపీ సైకిల్ ఎక్కించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆయన సక్సెస్ కూడా అయ్యారు. ఆయనే అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్. వైసీపీ సర్కారు పై తరచుగా విరుచుకుపడే హర్షకుమార్ ప్రస్తుతం కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారు.
ఆయనకు ఇటీవల ఒక పదవి కూడా ఇచ్చారు. అయితే.. ఆ పదవి నచ్చని ఆయన తాను సదరు పదవిని తీసుకోవడం లేదని, అయితే.. జీవిత కాలం కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని చెప్పారు. కానీ, ఆయన తన కుమారుడు శ్రీరాజ్‌ను మాత్రం సైకిల్ ఎక్కించారు. ఇటీవల టీడీపీ అదినేత చంద్రబాబుతో భేటీ అయిన జీవీ శ్రీరాజ్.. తాను పార్టీ కండువా కప్పుకొనేందుకురెడీగా ఉన్నట్టు చెప్పారు.
ఈ క్రమంలో తనకు పి. గన్నవరం అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్నట్టు చెప్పారు. ఎందుకంటే..అమలాపురం నుంచి లోక్‌సభ మాజీ స్పీకర్ గంటి బాలయోగి కుమారుడు రెడీగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయన ఎంపీగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఈ క్రమంలో అమలాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో నే జీవీ శ్రీరాజ్ పీ.గన్నవరం ఎంచుకున్నట్టు తెలుస్తోంది.
ఇక, శ్రీరాజ్ కుపచ్చ జెండా ఊపిన చంద్రబాబు టికెట్ విషయాన్ని మరికొన్నాళ్ల తర్వాత చర్చించి నిర్ణయం తీసుకుందామని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో శ్రీరాజ్ త్వరలోనే టీడీపీ తీర్థం పుచ్చుకోవడం.. ఆ పార్టీ కండువా కప్పుకోవడంఖాయమైంది. ఇదిలావుంటే, ఈ పరిణామంపై కాంగ్రెస్ నేతలు విస్తు పోతున్నారు. ఒకవైపు కాంగ్రెస్‌ను డెవలప్ చేయాలని అనుకుంటున్నసమయంంలో సీనియర్ అయినా హర్షకుమార్ ఇలా చేయడం ఏంటని అంటున్నారు.