జ‌నాలకు 900 కోట్ల‌కు టోపీ.. టీటీడీ బోర్డు స‌భ్యుడి నిర్వాకం

టీటీడీ బోర్డు స‌భ్యుడు, వైసీపీ సానుభూతిప‌రుడు బూదాటి ల‌క్ష్మీనారాయ‌ణ ప్ర‌జ‌ల‌కు కుచ్చుటోపీ పెట్టారు. అది చేస్తాం.. ఇది చేస్తాం..అని జ‌నాల‌ను న‌మ్మించివారి నుంచి భారీ ఎత్తున పెట్టుబ‌డులు ఆక‌ర్షించారు. వీటి విలువ సుమారు 900 కోట్ల రూపాయ‌లు ఉంటుంద‌ని హైద‌రాబాద్ సీసీఎస్ పోలీసులు తెలిపారు. అయితే.. బూదాటి ఏమీ చేయ‌క‌పోవ‌డంతో ఆయ‌న‌ను న‌మ్మిన ప్ర‌జ‌లు మోస‌పోయామ‌ని గుర్తించారు. ఈ క్ర‌మంలోనే పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయ‌న‌ను అరెస్టు చేశారు.

దాదాపు 2500 మంది రెండు తెలుగు రాష్ట్రాల‌ ప్ర‌జ‌లు బూదాటి అక్ర‌మాల్లో చిక్కుకున్నారు. ‘ప్రీలాంచ్’ పేరిట కొన్ని ప్రాజెక్టుల‌ను వారికి ఆశ చూపించారు. వాటిని న‌మ్మిన ప్ర‌జ‌లు వాటిలో పెట్టుబ‌డులు పెట్టారు. ఇలా పెట్టుబ‌డుటు పెట్టిన వాటిలో సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ గ్రామంలో సాహితీ శరవణి ఎలైట్ కీల‌క‌మైంది. దీనిలోనే ఎక్కువ మంది వంద‌ల కోట్లు పెట్టుబ‌డులు పెట్టారు.

23 ఎకరాల్లో 38 అంతస్తులతో పది అపార్టుమెంట్లు నిర్మిస్తున్నామని, డ‌బుల్‌, త్రిబుల్ బెడ్ రూమ్‌లు నిర్మిస్తున్నామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. అంతేకాదు.. ఇంట‌ర్నేష‌న‌ల్ ఫెసిలిటీస్ ఉన్నాయ‌ని న‌మ్మ‌బ‌లిగారు. అంతేకాదు.. త‌క్కువ ధ‌ర‌ల‌కే ఇస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. ఇలా.. మొత్తం 1,700 మంది నుంచి 5వంద‌ల 39 కోట్ల రూపాయ‌ల‌ మేర వసూలు చేశారు. అయితే, దీనికి హైద‌రాబాద్ మెట్రో డెవ‌ల‌ప్ మెంట్ నుంచి ఎలాంటి అనుమ‌తులు లేక‌పోవ‌డంతో ఇది ప్రారంభానికి నోచుకోలేదు.

అయితే, బాదాటి మాత్రం అనుమ‌తులు రావ‌డం ఆల‌స్య‌మైనా ప‌క్కాగా ప్రాజెక్టు ముందుకు సాగుతుంద‌ని న‌మ్మించారు. దీనిని న‌మ్మిన వారు పెట్టుబ‌డులు సుర‌క్షిత‌మే అనుకున్నారు. అయితే, 2019 నుంచి కొన‌సాగుతున్న ఈ వ్య‌వ‌హారంపై అనుమానాలు ప్ర‌బ‌ల‌డంతో చివ‌ర‌కు పోలీసుల‌ను ఆశ్ర‌యించారు.