రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి వ్యూహాలు వేస్తారో తెలియదు కదా! ఇప్పుడు ఏపీ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నవారికి ఇదే తత్వం బోధపడుతోంది. రాజకీయంగా తాము ఎదిగేందుకు, అధికారంలోకి వచ్చేందుకు ఛాన్స్ ఉన్నప్పటికీ.. కేంద్రంలోని బీజేపీ పెద్దలు మాత్రం చాలా దూర దృష్టితో ఏపీలో అడుగులు వేస్తున్నారు. బీజేపీని గమనిస్తే.. ఎక్కడా కూడా తాను దొరికిపోయే రాజకీయాలు చేసింది లేదు.
ఎక్కడ ఏ రాష్ట్రంలో అయినా.. వచ్చిన ఛాన్స్‌ను మిస్ చేసుకున్న పాపాన కూడా పోలేదు. అయితే, అనూహ్యంగా ఏపీలో మాత్రం పొత్తులు కలిసి వచ్చినా.. 40 శాతం పైగా ఓటు బ్యాంకు ఉన్న టీడీపీ చేతులు కలి పేందుకు సిద్ధంగా ఉన్న ఆ పార్టీ ముందుకు రాకపోతే, జనసేన అధినేతపవన్ కళ్యాణ్‌ను సైతం నిలువ రించే ప్రయత్నాలు చేయడం వెనుకప్రస్తుతానికి వైసీపీని గట్టెక్కించే ప్రయత్నం చేస్తోందనే చెప్పాలి.
దీనికి కారణం కూడా ఉంది. ప్రస్తుతం టీడీపీ అధికారంలోకి వస్తే.. అది బీజేపీఎదుగుదలకు అవకాశం లేకుండా పోతుంది. అంటే.. ఇప్పుడు అంతో ఇంతో బలహీనంగా ఉన్న టీడీపీని దెబ్బకొడితే.. ఆ గ్యాప్‌ను తాము వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుందనేది బీజేపీ లెక్క. ఈ ఎన్నికలను ఏదో రకంగా వదిలేసి.. వైసీపీకి ఫేవర్‌గా వ్యవహరిస్తే.. టీడీపీ ఎలానూ ఓడిపోతుంది.
ఇదే జరిగితే.. ప్రస్తుతం ఉన్న అంచనాల మేరకు, టీడీపీ 2029 ఎన్నికల వరకు ఇంత బలంగా ఉండే అవకాశం లేదు. ఇదే బీజేపీ కోరుకుంటున్న రాజకీయం. ఒకవేళ వైసీపీ బలపడినా.. జగన్‌పై ఉన్న కేసులను తనకు అనుకూలంగా మార్చుకుని, ఆయనను లొంగదీసుకుని తమిళనాడులో చేసిన రాజకీయం చేస్తే.. బీజేపీకి ఏపీలో మార్గం సుగమమం అవుతుంది.
ఈ వ్యూహంతోనే బీజేపీ అడుగులు వేస్తోందని అంటున్నారుప రిశీలకులు. అందుకే జనసేనను సైతం నిలువరించే ప్రయత్నం చేస్తోందని చెబుతున్నారు. మరి బీజేపీ వ్యూహం ఏమేరకు ఫలిస్తుందోచూడాలి.