వైసీపీలో చాలా మంది నాయకులు తండ్రుల బాటలో నడిచేందుకు ముందుకు వస్తున్నారు. వీరిలో చాలా మంది సీనియర్ల బిడ్డలు ఉండడం గమనా ర్హం. అయితే, వీరిలో ఎవరువిన్ అవుతారు.. ఎవరు ఫెయిల్ అవుతారనే చర్చకన్నా ముందు. అసలు సీఎం జగన్ వీరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? అనేది ప్రశ్న. ఇది ఇంకా తేలలేదు. అయినప్పటికీ.. తగ్గేదేలే అంటూ.. నాయకుల తనయులు దూకుడుగానే ఉన్నారు. ఉమ్మడి కృష్ణాలోని మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని కుమారుడు కిట్టు దూకుడు మామూలుగాలేదనే టాక్ వినిపిస్తోంది.
నేరుగా వెళ్లి ప్రజలను కలుస్తున్నాడు. గడపగడపకు కార్యక్రమాన్ని కూడా కిట్టు నిర్వహిస్తున్నాడు. అధికారులతోనూ మాట్లాడుతున్నారు. ప్రస్తుతం ఈయన జోరు చూస్తే కాబోయే ఎమ్మెల్యే అన్నట్టుగానే ఉంది. ఇదే విషయాన్ని బ్యానర్ల రూపంలో ఆయన స్నేహితులు సైతం పెడుతున్నారు. ఇక, మరో మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ తనయుడు కూడా దూకుడుగా ఉన్నారు. నరసన్నపేటలో ప్రతి కార్యక్రమంలోనూ తండ్రి వెంటే ఆయన పరుగులు పెడుతున్నారు. అంతేకాదు.. ప్రజలకు కూడా ఆయన కలుస్తూ.. హామీలు గుప్పిస్తున్నారు.
ఇక, స్పీకర్ తమ్మినేని తనయుడు కూడా ఇదే దూకుడుగా ముందుకు సాగుతున్నారు. అయితే, వీరిలో ఎవరికీ కూడా జగన్ టికెట్ ఇస్తానని కానీ, ఇవ్వడం ఖాయమని కానీ చెప్పలేదు. కానీ, తమ మాట జగన్ తీసేయడు అనే ధీమాతోనే వీరు ఇలా చేస్తున్నారనే వాదన అయితే పార్టీలో వినిపిస్తోంది. మరి ఇది ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఇదిలావుంటే, చిత్తూరులో కొందరు నాయకులు కూడా ఇలానే చేస్తున్నారు. తమ కుమారులను కార్యక్రమాలకు పిలుస్తున్నారు. దీంతో ఇక్కడ కూడా ఆసక్తికర రాజకీయం తెరమీదికి వచ్చింది. మరి చివరకు జగన్ ఏం చేస్తారో చూడాలి.
ఎదుకంటే.. వచ్చే ఎన్నికలు సీరియస్ అవుతున్నాయి. గెలుపు హోరాహోరీ కానుంది. ఇలాంటి సమయంలో జూనియర్లకు ఇచ్చి చేతులు కాల్చుకోకూడదని జగన్ భావిస్తున్నారు. కానీ, వీరు మాత్రం జగన్ ఎందుకు ఇవ్వరు? మేం ఒకటి.. మా వారసులు ఒకటీనా? అని ప్రశ్నించేధోరణిలో వ్యవహరిస్తున్నారు. దీంతో ఏం జరుగుతుందో చూడాలి. మొత్తానికి ఈ వ్యవహారం వైసీపీలో హాట్ టాపిక్‌గానే మారింది. మరి చూడాలి ఏం జరుగుతుందో.