ఉమ్మడి పశ్చిమ గోదావరిజిల్లాలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చౌదరి.. పస ఏమాత్రం తగ్గలేదా? ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే.. ఏకపక్షంగా ఇక్కడి ప్రజలు ఆయనను గెలిపిస్తారా? లక్ష ఓట్ల మెజారి టీతో ఆయన గెలిచే ఛాన్స్ ఉందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే పై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత పెరగడం .. ఒక కారణమైతే.. ఆయన అసలు ప్రజల మధ్య ఉండకపో వడం మరోకారణంగా కనిపిస్తోంది.
“ఏ చిన్న పని ఉందని వెళ్లినా.. ఆళ్ల నాన్నగారిని కలుసుకోమంటన్నారండి. ఆయన చెబితే.. చూద్దాం.. చేద్దాం.. అంటారు కానీ.. పట్టించుకోరండి!” గత రెండు మాసాలుగా ఇక్కడి రైతులు చెబుతున్న ఏకైక వాదన ఇదే. దీనిని బట్టి ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక, ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పు పై.. స్థానిక కమ్మ సమాజం.. తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేస్తోంది. దీని పై ఎమ్మెల్యే స్పందించాలని.. ఒత్తిడి కూడా చేస్తోంది. అయినా.. ఆయన ఎక్కడా బయటకు రావడం లేదు.
మరోవైపు.. అన్నగారి పేరు మార్పుపై చింతమనేని స్పందించారు. ఇంత కన్నా దౌర్భాగ్యం లేదని అన్నా రు. అదేసమయంలో రైతులకు అండగా ఉంటున్నారు. కేసులు పెట్టినా వెరవకుండా.. సమస్యలు ఉన్న చోట చింతమనేని ప్రత్యక్షం.. అన్నట్టుగా.. వ్యవహరిస్తున్నారు. ఇటీవల రైతుల పాదయాత్రకు మద్దతి చ్చిన సంగతి.. స్తానికంగా.. ఆయనకు మరిన్ని మార్కులు పడేలా చేసింది. గతానికి భిన్నంగా.. చింతమనేని.. వ్యవహారం.. ప్రజల్లో చర్చకు వచ్చింది.
ఇక, ప్రభుత్వం నుంచి అది తెస్తా.. ఇది తెస్తానని.. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన.. దెందులూరు ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి.. కేవలం ఇంటికే పరిమితం కావడం.. మధ్య మధ్య విదేశాలు వెళ్లిరావడం వరకే పరిమితం కావడం.. కూడా ప్రజలకు, ఆయనకు మధ్య గ్యాప్ పెంచేసింది. మరో వైపు.. చింతమనేని మాస్ జనాలకు మరింత చేరువయ్యారు. ఈ పరిణామాలతో దెందులూరు రాజకీయం రసవత్తరంగా మారిందని..ఇప్పటికిప్పుడు ఎన్నిక జరిగితే.. అబ్బాయి.. తట్టా బుట్టా సర్దుకోవాల్సిందేనని.. అంటున్నారు పరిశీలకులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates