కోవిడ్ వచ్చాక జగన్ తొలి రూరల్ టూర్ ఇదే

వైఎస్సార్ జయంతికి వైఎస్ కుటుంబ సభ్యులు ఎక్కడున్నా ఇపుడుపుపాయలకు చేరుకుని తండ్రి సమాధి వద్ద శ్రద్దాంజలి ఘటించడం ఆనవాయితీ. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక జరుగుతున్న రెండో జయంతి కార్యక్రమం ఇది. ఈ నేపథ్యంలో ఈరోజే ముఖ్యమంత్రి జగన్ కుటుంబం ఇడుపుల పాయకు చేరుకుంటుంది. తాడేపల్లి నుంచి గన్నవరం చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో కడపకు వెళ్తారు. కడప విమానాశ్రయం నుంచి ఇడుపుల పాయకు హెలికాప్టర్ లో వెళ్తారు. అక్కడ కుటుంబ అతిథి గృహంలో ఉంటారు.

అయితే, కోవిడ్ నేపథ్యంలో సీఎం జగన్ తొలి లాంగ్ టూర్ ఇదే. కడపకు ఎపుడు వెళ్లినా రెండు రోజులు ఉండే జగన్ ఈసారి కార్యక్రమం అనంతరం వెంటనే వెనుదిరగనున్నారు. కోవిడ్ భయమే దీనికి కారణం. ఎందుకంటే కడపలో ఉంటే నేతల తాకిడి ఉంటుంది. అందుకే ఈసారి ఆ హడావుడి ఏమీ పెట్టుకోవడం లేదు.

అంతేకాదు, కోవిడ్‌–19 వ్యాప్తి నేపత్యంలో స్టాండర్డ్‌ ఆపరేషనల్‌ ప్రోటోకాల్‌ (ఎస్‌ఓపీ) తప్పనిసరిగా పాటిస్తున్నారు. పర్యటనలో పాల్గొనే ప్రతి ఒక్కరికి కోవిడ్‌–19 త్రోట్‌ స్వాబ్‌ టెస్ట్‌ చేయించుకున్న తర్వాతే అనుమతిస్తారు. సాధారణ జనం తాకిడి ఈసారి ఉండదు. అంతేకాదు, ట్రిపుల్ ఐటీలో పలు కార్యక్రమాలున్న నేపథ్యంలో బయటనుండి వచ్చిన వారికి ఎలాంటి అనుమతి ఇవ్వడం లేదు. ముందురోజు అంటే మంగళవారం నిర్ణయించిన వారికే అనుమతి. స్టాఫ్, స్టూడెంట్స్ తప్ప అక్కడ కూడా ఎవరినీ అనుమతించరు. వీరన్నగట్టుపల్లె క్రాస్‌ నుంచి 7 చెక్‌ పోస్టులను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని అన్ని చోట్ల చెక్ ‌చేసి పంపిస్తారు.

జగన్ టూర్ షెడ్యూల్ హైలెట్స్

  1. రేపు ఉదయం కుటుంబంతో కలిసి వైఎస్ సమాధి వద్ద శ్రద్దాంజలి ఘటిస్తారు.
  2. రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్‌జీయూకేటీ) కొత్త భవన సముదాయాన్ని ప్రారంభిస్తారు.
  3. ట్రిపుల్‌ ఐటీలో వైఎస్సార్‌ స్మారక విగ్రహ ఆవిష్కరిస్తారు.
  4. మూడు మెగావాట్ సోలార్ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన
  5. మధ్యాహ్నం తాడేపల్లికి తిరుగుప్రయాణం ఉంటుంది
  6. కోవిడ్ నేపథ్యంలో జగన్ పర్యటన కొత్తగా ఉండనుంది.