రాజకీయాలు ఎప్పుడు ఎలాంటి టర్న్‌తీసుకుంటాయనేది చెప్పడం కష్టం. నిన్నటి వరకు ఇక, అయిపో యిందనుకున్న పార్టీలు.. నాయకులు కూడా పుంజుకుంటున్న పరిస్థితి దేశంలోనే కనిపిస్తోంది. ఇక, ఏపీలో నూ.. వ్యూహాత్మక రాజకీయాలు కొనసాగుతున్నాయి. తాజాగా.. ఎప్పుడూ.. ఎలాంటి సవాళ్లు ..ప్రతిసవాళ్లు చేయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. అధికార పార్టీ వైసీపీకి .. గట్టి సవాలే విసిరారు. తొలి రోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా.. ఆయన వైసీపీని ఉద్దేశించి ఘాటుగానే వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం.
వచ్చే ఎన్నికల్లో తనపార్టీలోని ఎమ్మెల్యేలు.. అందరికీ టికెట్ ఇస్తానని.. చంద్రబాబు చెప్పినట్టు తెలిసిం దే. అయితే.. ఇదే సాహసం.. జగన్ చేయగలరా? ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు.. అందరికీ.. ఆయన టికెట్లు ఇవ్వ గలరా..? అని.. చంద్రబాబు సవాల్ రువ్వారు. నిజానికి.. ఇది అదిరిపోయే సవాలే అని అనుకోవాలి. ఎందు కంటే.. ప్రస్తుతం వైసీపీలో 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు(సీఎం మినహా). వీరిలో సగంమందికి పైగానే.. అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ విషయం పార్టీ చేయించిన సర్వేల్లోనూ.. స్పష్టంగా తెలిసింది. ఈ నేపథ్యంలో వారిలో సగం మందికి టికెట్లు ఇవ్వరాదని.. పార్టీ అధిష్టానమే చూస్తోంది. అందుకే.. కొత్తవారి కోసం వెతుకుతోంది. అయితే.. ఇప్పు డు చంద్రబాబు.. చేసిన ప్రకటన ఆసక్తిగా మారింది. తన పార్టీలో ఉన్న సిట్టింగులు అందరికీ..(అంటే.. పార్టీకి విశ్వాసపాత్రులుగా ఉన్నవారు) టికెట్లు ఇస్తామని చెప్పారు. ఇక, వైసీపీ లోనూ అందరికీ టికెట్లు ఇచ్చే దమ్ముందా? అని సవాల్ విసిరినట్టు తెలుస్తోంది.
నిజానికి ఈ విషయం..ఇప్పుడువైసీపీలో మంటలు రేపుతోంది. ఎందుకంటే.. ఇప్పటి వరకు..వైసీపీలో సిట్టింగులు దాదాపు అందరూ.. కూడా.. తాముకష్టపడితే..టికెట్ తమకేననే వాదనను వినిపిస్తున్నారు. ఇక జగన్ కూడా.. వారిని.. మీరు కష్టపడండి.. అంటూ.. చెబుతున్నారు. దీంతో గడపగడప కు తిరుగుతున్నా రు. అయినా కూడా.. ఎన్నికలకు ముందు.. అందరికీ టికెట్లు ఇచ్చే పరిస్థితి లేదని.. వైసీపీలో నే వినిపి స్తున్న సమయంలో.. చంద్రబాబువిసిరిన సవాల్.. మరింత కుదిపేస్తోంది. మరి దీనిపై వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.