వైసీపీకి పొంచి ఉన్న పెను ప్ర‌మాదం.. ఎలాగంటే!

ఏపీ అధికార పార్టీలో ధీమా క‌నిపిస్తోంది.తాము అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాలే త‌మ‌ను మ‌రోసారి గ‌ద్దెనెక్కేలా చేస్తాయ‌ని.. నాయ‌కులు భావిస్తున్నారు. మంచిదే. అయితే.. అదేస‌మ‌యంలో ఈ సంక్షేమం ఎంత‌మందికి అందుతోంది?  ఎంత మంది హ్యాపీగా ఫీల‌వుతున్నారు? అనే విష‌యాల‌ను ప‌రిశీలిస్తే.. వైసీపీకి డేంజర్ బెల్స్ ఎందుకు మోగుతున్నాయ‌ని అంటున్నారో.. తెలుస్తుంది. ఏపీలో మొత్తం 4.95 కోట్ల మంది జ‌నాభా ఉన్నారు.  

వీరిలో ఉద్యోగాలు చేసేవారు.. 2 కోట్ల కుటుంబాలు ఉన్నారు. ఇత‌ర చేతి వృత్తులు చేసేవారు.. 70 ల‌క్ష‌ల మంది ఉన్నారు. ఇవ‌న్నీ ప్ర‌భుత్వం ద‌గ్గ‌రున్న గ‌ణాంకాల మేర‌కు చెబుతున్న‌వే. సో.. వీరిలో ఎంత మందికి ప్ర‌భుత్వం నుంచి సంక్షేమ ఫ‌లాలు అందుతున్నాయి? అనేది ప్ర‌శ్న‌. ఎందుకంటే.. వీరిపైనే వైసీపీ స‌ర్కారు ఆశ పెట్టుకుంది కాబ‌ట్టి!  2019లో అధికారంలోకివ‌చ్చిన వైసీపీ..అప్ప‌టి వ‌ర‌కు ఉన్న సామాజిక ఫించ‌న్ల‌ను పెంచింది. అదేస‌మ‌యంలో కొన్ని ప‌థ‌కాల‌ను తీసుకువ‌చ్చింది.

అయితే.. ఈ పెంచిన ఫించ‌న్ల మాట ఎలా ఉన్నా.. వివిద కార‌ణాల‌తో.. వేల మందిని తొల‌గించింది. అదే స‌మ‌యంలో గ‌త ప్ర‌భుత్వం అమ‌లు చేసిన తోఫాలు.. కానుక‌ల‌ను ఎత్తేసింది. విదేశీ విద్యాదీవెన కార్య‌క్ర మాన్ని పూర్తిగా నిలిపి వేసింది. దీంతో ల‌బ్ధిదారుల సంఖ్య పై నా ప్ర‌భావం ప‌డింది. కేవ‌లం ప్ర‌భుత్వం నుంచి 5 వేల రూపాయ‌ల పారితోషికం అందుకుంటున్న వ‌లంటీర్ల కుటుంబాల్లోని వారికి కూడా పించ‌న్లు నిలిపివేసింది. దీంతో సంక్షేమ‌ప‌థ‌కాల నుంచి పేర్లు తొలిగిపోయిన వారు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

మ‌రోవైపు.. ఇన్ని సంక్షేమ ప‌థ‌కాల‌కు కార‌ణ‌మైన ప‌న్నులు.. క‌డుతున్న‌వారికి ప్ర‌భుత్వం ఏం మేలు చేస్తోంది? అనేది మౌలిక ప్ర‌శ్న‌. గ‌తంలో పింక్ కార్డు ఉండేది. ఇప్పుడు దానిని ఎత్తేశారు. ఇక‌, చెత్త‌ప‌న్ను.. వృత్తి ప‌న్నుల పేరుతో బాదేస్తున్నారు. పెట్రో ల్ ధ‌ర‌లు త‌గ్గించ‌డం లేదు. ఇసుక అందుబాటులో లేదు. సిమెంటు ధ‌ర‌లు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో నిర్మాణ రంగం కుప్ప‌కూలింది. ఫ‌లితంగా.. దానిపై ప్ర‌త్య‌క్షంగా ప‌రోక్షంగా ఆధార‌ప‌డిన ల‌క్ష‌ల కుటుంబాల‌కు ఉపాధి లేకుండా పోయింది.

ఉద్యోగాలు లేవు.. ఉపాది లేదు. యువ‌త‌కు భ‌రోసా కూడా కుంటు పడింది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో వైసీపీ చెబుతున్న సంక్షేమ మంత్రానికి ఓట్లు రాలేదెక్క‌డ‌? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. ఇదే విష‌యాన్ని ఇటీవ‌ల జాతీయ మీడియా ప్ర‌ముఖంగా పేర్కొంది. దీంతో ఇప్పుడు వైసీపీ నేత‌ల మ‌ధ్య సంక్షేమ స‌ర్కారుపై త‌ర్జ‌న భ‌ర్జ‌న సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఎన్నిక‌ల స‌మయానికి ఏం చేస్తారో చూడాలి.