మాజీ మంత్రి భూమా అఖిలప్రియ వైఖరి పార్టీ నేతలకు అర్ధమే కావటం లేదు. స్వయంగా చంద్రబాబు నాయుడు జిల్లాకు వస్తే పెద్దగా స్పందించలేదు. జిల్లాలోకి అడుగుపెట్టినపుడు దణ్ణం పెట్టేసి మాయమైపోయారు. రెండు రోజులు చంద్రబాబు జిల్లాలో తిరిగినా మళ్ళీ ఎక్కడా అడ్రస్ కనబడలేదు. మళ్ళీ మహానాడు వేదిక మీద మాత్రం ప్రత్యక్షమయ్యారు. టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగసభ సందర్భంగా అఖిల తమ్ముడు జగద్విఖాత్యరెడ్డితో కలిసి వేదికమీద కనిపించారు.
వేదికమీద అఖిల కూర్చునున్నా ఎవరు కూడా పట్టించుకున్నట్లు లేదు. కాకపోతే మాజీమంత్రి కాబట్టి వేదికమీద కూర్చోవటానికి ఎవరు అడ్డుచెప్పలేదంతే. నిజానికి ఈమెను జిల్లాలోని నేతల్లో అత్యధికులు దూరం పెట్టేశారు. ఈమెకు ఎవరితోను పొసగడం లేదు. సీనియర్లను గౌరవించాలని కూడా మాజీమంత్రికి తెలియదనే ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అందుకనే ఈమెకు అందరు దూరంగానే ఉంటారు. పార్టీ సమావేశాలకు కూడా ఈమెను పిలవటం మానుకున్నారట.
చిన్నవయసులోనే కారుణ్య నియామకం కోటాలో మంత్రి అయిపోయిన అఖిల చాలా దుడుకు మనిషి. అందుకనే అందరితోను ఎప్పుడూ గొడవలు పడుతునే ఉంటారు. ఈ దంపతుల మీద హత్యాయత్నం, కిడ్నాపులు, ఫోర్జరీ, భూ ఆక్రమణల్లాంటి కేసులు చాలా ఉన్నాయి. గడచిన మూడేళ్ళల్లో టీడీపీ నేతల్లో ఇంతగా ఇమేజ్ డ్యామేజ్ అయిన నేత మరొకరు లేరనే చెప్పాలి. ఈ కారణంతోనే చంద్రబాబు, లోకేష్ కూడా ఈమెను దూరం పెట్టారని పార్టీలోనే టాక్ నడుస్తోంది.
అందుకనే ఈమె పార్టీ కార్యక్రమాలకు వచ్చినా ఎవరు పట్టించుకోరు, రాకపోయినా ఎవరూ పట్టించుకోరు. వచ్చే ఎన్నికల్లో ఆళ్ళగడ్డలో తానే టీడీపీ అభ్యర్ధిగా పోటీచేస్తానని అఖిల నియోజకవర్గంలో చెప్పుకుంటు తిరుగుతున్నారు. అయితే ఈమెకు టికెట్ వచ్చే అవకాశాలు లేవని ఈమె బద్ధ విరోధి, సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి వర్గం ప్రచారం చేస్తోంది. ఎందుకంటే ఇక్కడనుండి పోటీకోసం ఏవీ కూడా గట్టిగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మహానాడుకు హాజరు కాకపోతే మొదటికే మోసం వస్తుందని అఖిల భయపడినట్లున్నారు. అందుకనే ఎవరు పట్టించుకోకపోయినా వేదిక మీద కూర్చున్నారు.
This post was last modified on May 29, 2022 10:45 am
హారర్ కామెడీ జానర్లో ప్రేక్షకులని ఆకట్టుకున్న కాంచన సిరీస్లో మరో సినిమా రాబోతోన్న విషయం తెలిసిందే. రాఘవ లారెన్స్ దర్శకత్వం…
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి ప్రమోటర్స్ కావాలా? పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే.. వ్యూహాలు రచించడంతోపాటు.. ప్రజలకు పార్టీని చేరువ చేసేందుకు ప్రమోటర్ల…
కొత్త సినిమాలకు ముందు రోజు ప్రీమియర్లు వేయడం కొత్త కాకపోయినా ఇది రెండువైపులా పదునున్న కత్తిలా మారడంతో ఉపయోగాలు ఎన్ని…
మెల్లగా గేమ్ ఛేంజర్ గేరు మారుస్తోంది. ఇప్పటికే మూడు పాటలు, ఒక టీజర్ వచ్చాయి. ఎల్లుండి జరగబోయే యుఎస్ ప్రీ…
ఏపీ ఫైబర్ నెట్ సంస్థపై వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అవకతవకల గురించి ఆ సంస్థ చైర్మన్ జీవీ…
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…