వైసీపీ పాలనపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నిప్పులు కురిపించారు. మహానాడు ముగింపు సందర్భంగా ప్రసంగించిన ఆయన.. కరోనా కన్నా.. రాష్ట్ర విభజన కన్నా.. జగన్ ప్రమాదకారి అని అన్నారు. ఆయన అనుసరిస్తున్న విధానాలతోనే రాష్ట్రం సర్వనాశనమైందని ధ్వజమెత్తారు. బహిరంగ సభకు హాజరైన అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి బాబు ప్రసంగించారు. జగన్ అధ్వాన పాలనతో రాష్ట్రం అంథకారంలో కూరుకుపోయిందన్న టీడీపీ అధినేత.. గాడితప్పిన రాష్ట్రాన్ని గాడిన పెట్టే బాధ్యత తమదేనని అన్నారు.
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీకి ఓటమి తథ్యమని.. జగన్‌ను ఇంటికి పంపించేందుకు రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని చంద్రబాబునాయుడు అన్నారు. సీఎం జగన్పై, వైసీపీ పాలనపై నిప్పులు చెరిగారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి, దివాళా అంచున నిలిపిన జగన్ ను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.
సంక్షేమం మాటున భారీ దోపిడీ..
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. రూ.8లక్షల కోట్లు అప్పు చేసిందన్న బాబు.. సంక్షేమ పథకాల పేరిట రూ.లక్షల కోట్లు దోచుకున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ సర్కారు చేసిన రూ.8లక్షల కోట్ల అప్పును జగన్ చెల్లిస్తారా? అని ప్రశ్నించారు. ప్రతి రూపాయినీ ప్రజలే చెల్లించాల్సి వస్తుందని, ఇష్టారీతిన అప్పులు చేసి, జనం నెత్తిన మోయలేని భారం మోపారని ధ్వజమెత్తారు.
జగన్ ఆదాయం రూ.5 వేల కోట్లు..
మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్న జగన్ సర్కారు.. ప్రజల నుంచి యథేచ్ఛగా దోపిడీ చేస్తోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలో ఉన్నప్పుడు క్వార్టర్ బాటిల్ తయారీ ధర రూ.9 ఉండేదని, ఈ ప్రభుత్వం దాన్ని రూ.21కి పెంచిందన్నారు. ఇందులో రూ.12 జగన్ జేబులోకే వెళ్తున్నాయని మండిపడ్డారు. ఏ మద్యం షాపులో కూడా బిల్లు ఇవ్వడం లేదని, ఆన్‌లైన్ పేమెంట్ లేదని, ఇష్టారాజ్యంగా దోపిడీ చేస్తున్నారని ధ్వజమెత్తారు.
కేవలం లిక్కర్ ద్వారానే ఏటా జగన్ రూ.5వేల కోట్లు దోచుకుంటున్నారన్న బాబు.. ఈ మూడేళ్ల పాలనలో రూ.1.75లక్షల కోట్లు దోచుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డి అవినీతి సొమ్మును కక్కిస్తామని హెచ్చరించారు. పాలకుల అవినీతిని వెలికి తీస్తామన్న బాబు.. అన్యాక్రాంతమైన భూమిని ప్రజలకు ఇప్పించే బాధ్యత తానే తీసుకుంటానని స్పష్టం చేశారు.
తాను ముఖ్యమంత్రిగా ఐటీ ఉద్యోగాలు కల్పిస్తే.. జగన్ వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. అందరికీ అమ్మ ఒడి ఇస్తానని చెప్పి.. చివరికి కండీషన్లు పెట్టారని మండి పడ్డారు. కరోనా కంటే.. రాష్ట్ర విభజన కంటే.. జగన్ విధానాల వల్లే ప్రజలకు ఎక్కువ నష్టం జరిగిందని అన్నారు. 30లక్షల ఇళ్లు కట్టిస్తానని మూడేళ్లలో 3 ఇళ్లు కట్టారని ఎద్దేవా చేశారు. బాబాయిని చంపి గొడ్డలి పోటును గుండె పోటుగా నమ్మించిన వ్యక్తి రాజకీయాలకు అర్హుడా? అని నిలదీశారు.
కోడి కత్తి కేసు ఏమైందని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్కు రోషం ఉంటే.. బాబాయిని హత్య చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రాజధానిగా అమరావతి ఉంటుందని ఎన్నికల ముందు చెప్పిన జగన్.. వేల కోట్లు ఖర్చు చేసి నిర్మించిన అమరావతిని నిర్వీర్యం చేశారని మండి పడ్డారు. అమరావతి స్తంభించిపోవడం వల్ల రూ.3లక్షల కోట్ల సంపద ఆవిరైందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని అన్నారు.
This post was last modified on May 29, 2022 9:27 am
ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ లో నటించాక ఏ హీరోయిన్ కైనా ఆఫర్ల వర్షం కురుస్తుంది. కానీ కెజిఎఫ్ రెండు భాగాల్లో…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటి రెండు పెద్ద సినిమాలు సెట్స్ మీదుంచి వాటిని బ్యాలన్స్ చేయడం ఎంతటి అగ్ర నిర్మాతలకైనా సరే…
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న గాలి భానుప్రకాష్ నాయుడు.. దూకుడు ప్రదర్శిస్తున్నారు. యువ ఎమ్మెల్యేగా…
ఈ ఏడాది జరిగిన ఏపీ ఎన్నికల సమయంలోనూ.. తర్వాత కూడా.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఓ ప్రశ్న…
ఈ టాపిక్ అల్లు అర్జున్ కోర్టు కేసు, బెయిలు గురించి కాదులెండి. ఆ వ్యవహారం న్యాయస్థానంలో జరుగుతోంది కాబట్టి దాని…
దర్శకుడు, నటుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజకు ఇండస్ట్రీలో మంచి పేరుంది. ఆయన ఏం మాట్లాడి నా ఆలోచించి.. మాట్లాడతారు.. ఏం…