ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ తన తప్పులు తెలుసుకుంది. పార్టీ పరిస్థితిని క్షేత్రస్థాయిలో అంచనా వేసింది. ఒంగోలు కేంద్రంగా జరుగుతున్న మహానాడులో పార్టీ పరిస్థితిపై పోస్టుమార్టం చేపట్టిన పార్టీ నేతలు.. రాష్ట్రం లో పార్టీ పరిస్థితిని పూర్తిగా అంచనా వేశారు. పార్టీ అధినేత చంద్రబాబు నుంచి నారా లోకేష్ వరకు.. అందరూ కూడా.. పార్టీలోని లోపాలను ప్రస్తావించారు. సాధారణంగా.. పార్టీ అంతా బాగుందని పదే పదే చెప్పేస్థాయి నుంచి ఇప్పుడు తప్పులు ఎత్తి చూపుకునే పరిస్థితి రావడం మంచిదే.
ఎందుకంటే.. ఎవరో వచ్చి.. తమ తప్పులు చెప్పే కంటే.. ఎన్నికల్లో ఎదురు దెబ్బలు తగిలే కంటే.. ముందు గానే.. టీడీపీ తనతప్పులు తెలుసుకోవడం.. మంచి పరిణామమే. దాదాపు 30 నియోజకవర్గాల్లో అసలు ఇంచా ర్జ్‌లే లేరని.. టీడీపీ ప్రస్తావించింది. ఇక, ఉన్న చోట్ల కూడా 40 నియోజకవర్గాల్లో అంతర్గత పోరు జోరుగా సాగుతోంది. ఇక, నియోజకవర్గాలకు ఇంచార్జ్‌లు ఉన్నప్పటికీ.. పార్టీలో ఆధిపత్య రాజకీయాలు సాగుతున్న పరిస్థితి 40 నియోజకవర్గాల్లో కనిపిస్తోందని తేల్చి చెప్పింది.
అంటే.. మొత్తంగా.. 120 నియోజకవర్గాలకు పైగానే.. టీడీపీ పరిస్థితి ఇబ్బందిగానే ఉందని.. పార్టీ అధినేత స్వయంగా ఒప్పుకున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. మరి.. ఇప్పటి వరకు ఎందుకు సరిదిద్దలేక పోయారు..? అనేది ప్రధాన ప్రశ్న. అంతేకాదు… కనీసం.. ఇప్పటకైనా.. దీనిపి సరిదిద్దుతారా? అనేది కూడా ప్రధానమే! కానీ.. అసలు నియోజకవర్గాలకు పార్టీ ఇంచార్జ్‌లనను నియమించకపోయినా.. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి బాధ్యులను నియమించారు.
సో.. వారైనా.. పార్టీని లైన్‌లో పెట్టాల్సిన అవసరం ఉందికదా.. అంటే.. దీనికి సమాధానం లభించడం లేదు. అదేసమయంలో మహిళా నేతలకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. అయితే..వారు కూడా క్షేత్రస్థా యిలో పనిచేయడం లేదు. సో.. దీనిని బట్టి.. పార్టీ ఇలా ఇబ్బందుల్లో కూరుకుపోవడానికి అసలు కారణం.. నాయకులు లేకపోవడం కాదు.. ఉన్న నాయకుల్లోకలిసి మెలిసి పనిచేద్దాం.. అనే ధోరణి కనిపించకపోవ డం. అదేసమయంలో లోపాలు ఉన్న నియోజకవర్గాల్లో అధిష్టానం ప్రత్యేకంగా దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పులు గుర్తించడం కాదు.. తప్పులను సరిచేసే వ్యూహాలు.. అప్పుడే.. పార్టీ అధికారంలోకి వస్తుందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on May 29, 2022 11:51 am
సౌతాఫ్రికా సిరీస్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం చూశాం. పది నెలల తర్వాత సొంతగడ్డపై ఆడుతూ పరుగుల వరద పారించాడు. మూడు…
పొన్నియిన్ సెల్వన్ తర్వాత మణిరత్నం కంబ్యాక్ అయ్యారని అభిమానులు భావించారు కానీ థగ్ లైఫ్ దెబ్బ మళ్ళీ కథను మొదటికే…
‘బాహుబలి’ కోసం ఐదేళ్ల పాటు ప్రభాస్ ఎంత కష్టపడ్డాడో.. రెండు పార్ట్స్లో ఎంతో ఆకర్షణీయంగా కనిపించాడో తెలిసిందే. కానీ అంత…
తన జీవితంలో జరగని సంఘటన ఇప్పుడు జరిగిందంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో పర్యటిస్తున్నారు.…
రీఎంట్రీ తర్వాత వరుసగా మూడు రీమేక్లతో పలకరించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ ఏడాది రెండు నెలల వ్యవధిలో రెండు…
మన శంకరవరప్రసాద్ గారు నుంచి మరో పాట వచ్చేసింది. నిజానికీ రిలీజ్ రేపు జరగాలి. కానీ ఒక రోజు ముందుగా…