Political News

రేవంత్ అదిరిపోయే హామీ: 30 రోజుల్లో 2 ల‌క్ష‌ల రుణ‌మాఫీ!!

తెలంగాణ‌లోని టీఆర్ఎస్‌ పాలనపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తనదైన శైలిలో విమర్శలు చేశారు. కేసీఆర్‌ పాలనలో ధనిక రాష్ట్రం అస్తవ్యస్తమైందని ఆరోపించారు. ఏమీ చేయకుండానే రూ.5లక్షల కోట్లు అప్పులు చేశారని విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని విమర్శించారు. తెలంగాణ అధ్యయన వేదిక ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్‌రెడ్డి… కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక… మొదటి 30 రోజుల్లోనే 2 లక్షలు మాఫీ చేస్తామమన్నారు. రైతులను పూర్తిగా రుణవిముక్తులను చేయడం తమ ప్రథమ లక్ష్యమని తెలిపారు.

ఆ తరువాత బ్యాంకర్లతో ఒప్పందం కుదుర్చుకుని నాలుగేళ్లలో వడ్డీతో కలిపి బ్యాంకులకు చెల్లిస్తామని వివరించారు. రాష్ట్రంలో ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకుని, అమలు చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవన్న అంచనాతోనే వరంగల్‌ రైతు డిక్లరేషన్ ప్రకటించినట్లు వివరించారు. పేదలకు రైతుబంధు ఇవ్వాల్సి ఉండగా… ధనికులకు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించిన రేవంత్… అర్హులకు మాత్రమే రైతుబంధు ఇస్తామన్నారు. ఏడేళ్లలో కేసీఆర్‌ 5లక్షల కోట్లు అప్పులు చేశారని ఆరోపించారు.

“రైతులకు రుణ విముక్తి కల్పిస్తాం. మొదటి 30 రోజుల్లోనే రూ.2లక్షలు మాఫీ చేస్తాం. విడతలవారీగా వడ్డీతో సహా ప్రభుత్వమే చెల్లిస్తుంది. 15 శాతం రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. వృథా ఖర్చును పూర్తిగా తగ్గిస్తాం. అర్హులకు మాత్రమే రైతుబంధు ఇస్తాం. కేసీఆర్ పాలనలో ధనిక రాష్ట్రం అస్తవ్యస్తమైంది. ఏమీ చేయకుండానే 5లక్షల కోట్లు అప్పులు చేశారు. సాగునీటి వసతి పెరిగినందునే వరిసాగు విస్తీర్ణం పెరిగిందని చెబుతున్న ప్రభుత్వం 30లక్షల వ్యవసాయ పంపుసెట్లకు ఎందుకు ఉచిత విద్యుత్త్ ఇస్తోంది?” అని విమ‌ర్శించారు.

గతంలో హైదరాబాద్‌ చుట్టు పక్కల వ్యవసాయ భూములుండేవని వివిధ రకాల పంటలు పండేవని.. ఇప్పుడా పరిస్థితి లేదని విమ‌ర్శించారు. చిత్తూరు నుంచి చక్కెర కొనుగోలు చేయడంతో వచ్చే కమీషన్‌ కోసమే తెలంగాణ రాష్ట్రంలో చెక్కర పరిశ్రమను మూసివేయించారని రేవంత్ విరుచుకుప‌డ్డారు. నూతన వ్యవసాయ విధానం తీసుకురావడం ద్వారా…పంటల సాగు విషయంలో రాష్ట్రంలో గందరగోళం పరిస్థితులు ఉండవన్నారు. దేశంలో ఏ వ్యాపారైనా తాను ఉత్పత్తి చేసిన వస్తువులపై తానే ధర నిర్ణయించుకుంటాడని, కానీ రైతులు పండించిన పంటపై కొనుగోలుదారులు నిర్ణయిస్తున్నారని, ఇది చాలా ఆందోళనకరమైన విషయమ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

This post was last modified on May 18, 2022 8:49 pm

Share

Recent Posts

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

46 minutes ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

3 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

3 hours ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

4 hours ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

12 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

14 hours ago