Political News

రోడ్లే పవన్ ఆయుధం

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పనితీరులో దూసుకుపోతున్నారు. మొన్నటిదాకా సినిమా నటుడిగా తనదైన సత్తా చాటిన పవన్… రాజకీయాల్లోకి వచ్చాక… గెలుపు అన్న మాటే లేకున్నా.. పార్టీని ఏళ్ల తరబడి నడుపుతూ వచ్చి… తన స్థిర చిత్తాన్ని చాటుకున్నారు. ఇక ప్రజా ప్రతినిధిగా గెలిచాక ఆయన తనదైన అసలు సిసలు సత్తా చాటుతున్నారు. వెరసి అంతకంతకూ తన బలాన్ని పెంచుకుంటూ సాగుతున్న పవన్… రానున్న కాలంలో మరింత మేర ఉత్తమ ఫలితాలను సాదించడం ఖాయమే. అందుకు నిదర్శనంగా పలు కీలక ఘటనలు నిలుస్తున్నాయి. వాటన్నంటిలోకి రహదారుల అభివృద్ధే పవన్ కు కొండంత అండగా నిలుస్తుందని కూడా చెప్పక తప్పదు.

గిరిజన ప్రాంతాలకు ప్రధాన రహదారులతో అనుసంధానం చేసేలా అడవి తల్లి బాట పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని పవన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమాన్ని అలా కొనసాగిస్తూనే… రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఘోరంగా ఉన్న రహదారులను కూడా అభివృద్ధి చేస్తూ పవన్ సాగుతున్నారు. అందులో భాగంగా ఏలేశ్వరం నుంచి అడ్డతీగల రహదారిని పవన్ అతి తక్కువ కాలంలోనే అభివృద్ధి చేయించారు. కేంద్ర పథకం కింద ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయించిన పవన్.. ఆ రోడ్డును రికార్డు సమయంలో పూర్తి చేయించారు. ఈ రోడ్డు గతంలో ఎలా ఉండేది? పవన్ ప్రత్యేక శ్రద్ధ పెట్టాక ఇప్పుడు ఎలా ఉంది? అన్న విషయాన్ని వివరిస్తూ సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చిన ఓ వీడియో వైరల్ అయిపోయింది.

వచ్చే ఎన్నికల్లో పవన్ స్టామినాను ఈ తరహా రహదారులే నిరూపిస్తాయన్న మాట అయితే గట్టిగా వినిపిస్తోంది. ఎలేశ్వరం నుంచి అడ్డతీగలకు దారి తీసే రహదారిలో ప్రత్యేకించి ఏలేశ్వరం జడ్డంగి మధ్యలో ఉన్న 10.5 కిలో మీటర్ల రోడ్డు అయితే గతంలో భారీ గుంతలతో ఉండేది. ఈ గుంతల కారణంగా ఈ రోడ్డులో ప్రయాణం అంటేనే నరకాన్ని తలపించేది. భారీ గుంతలతో నిండిన ఈ రోడ్డు ద్వారా నిత్యం వందలాది వాహనాలు… వాటిలో చిన్నపిల్లలను స్కూలుకు తీసుకెళ్లే బస్సులు, సాధారణ ప్రయాణికుల కోసం తిరిగే ఆర్టీసీ బస్సులు ప్రయాణించేవి. ఈ కారణంగా ఎప్పుడు ఎలాంటి ప్రమాదం చోటుచేసుకుంటుందోనన్న భయం అందరినీ వెంటాడెది. ఈ రోడ్డును మొన్నటిదాకా పట్టించుకున్న నాథుడే లేడంటే అతిశయోక్తి కాదేమో. 

అయితే ఆ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి రోడ్డు పరిస్థితిని వివరించేలా ఓ చిన్న వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దానిని పవన్ కల్యాణ్ సోషల్ మీడియా హ్యాండిళ్లకు చేరేలా ట్యాగ్ చేశాడు. ఈ వీడియో పోస్ట్ అయిన 15 గంటల్లోనే దానిని చూసిన పవన్… వెంటనే ఆ రోడ్డును బాగు చేసే దిశగా పకడ్బందీ చర్యలు చేపట్టారు.

వీడియో చూసిన వెంటనే.. కాకినాడ జిల్లాకు చెందిన ఆర్ అండ్ బీ అధికారులను లైన్ లోకి తీసుకున్న పవన్.. యుద్ధ ప్రాతిపదికన ఆ రోడ్డును బాగు చేయాలని, అందుకు కేంద్ర పథకాల ద్వారా అందుతున్న నిధులను వినియోగించాలని ఆదేశాలు జారీ చేశారు. పవన్ ఆదేశాలతో కదిలిన అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన ఆ రోడ్డును పూర్తి చేసింది. ఇప్పుడు ఆ రోడ్డుకు సంబంధించిన గత చిత్రాలు, ఇప్పటి చిత్రాలతో సదరు వ్యక్తి మరో వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియోను చూస్తుంటే… అభివృద్ధిపై పవన్ చిత్తశుద్ధితో పాటుగా, ఈ తరహా రోడ్లే భవిష్యత్తులో ఆయనకు ఆయుధంగా మారనున్నాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 

This post was last modified on August 11, 2026 4:57 pm

Share

Recent Posts

దిల్ రాజు ద‌గ్గ‌ర ఆ డ‌బ్బులు తీసుకోని ప‌వ‌న్‌

సామాన్య జ‌నాల్లోనే కాదు.. ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖుల్లోనూ పెద్ద సంఖ్య‌లో వీరాభిమానుల‌ను సంపాదించుకున్న హీరో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్. తాము…

2 hours ago

క్లారిటీ ఇవ్వాలంటోన్న సేన‌.. వెయిట్ అంటోన్న సేనాని..!

ఏపీలో స్థానిక సంస్థ‌ల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు ప్ర‌భుత్వం రెడీ అయింది. దీనికి సంబంధించిన ఓట‌ర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు..…

2 hours ago

ఔరా అవినాష్‌… పోలీసుల‌తో చెల‌గాట‌మా?!

మాజీ మంత్రి దేవినేని నెహ్రూ కుమారుడు, ప్ర‌స్తుత వైసీపీ నేత‌, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్య‌క్షుడు దేవినేని అవినాష్ పోలీసుల‌తో…

3 hours ago

రాకా రికార్డులు అప్పుడే మొదలైపోయాయి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కలయికలో తెరకెక్కుతున్న రాకా విడుదల చాలా దూరంలో ఉండగానే రికార్డుల వేట…

4 hours ago

‘లస్ట్’ కథలు ఈసారి బెస్ట్ కాలేదా

కామం కాన్సెప్ట్ మీద తీసిన వెబ్ సిరీస్ గా లస్ట్ స్టోరీస్ మొదటి సీజన్ కు విపరీతమైన ఆదరణ దక్కింది.…

5 hours ago

హిందీ ప్రేక్షకులకు ఇరుముడి నచ్చేసింది

మన తెలుగు సినిమాలు ఏపీ తెలంగాణలో ఎంత బ్లాక్ బస్టర్ అయినా హిందీ లో థియేట్రికల్ గా వర్కౌట్ చేసిన…

9 hours ago