Political News

కోన‌సీమ జిల్లా: దిగొచ్చిన వైసీపీ ప్ర‌భుత్వం

కోనసీమ జిల్లా పేరు మారనుంది. ఆ జిల్లా పేరును డా.బీఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై త్వరలోనే ప్రాథమిక నోటిఫికేషన్‌ విడుదల కానుంది. అమలాపురం కేంద్రంగా ఏర్పాటు చేసిన కోనసీమ జిల్లాకు డా బీఆర్‌.అంబేడ్కర్‌ పేరు పెట్టాలని దళిత, ప్రజాసంఘాలు, వివిధ పార్టీలు కోరాయి. దీనికోసం పలుచోట్ల ఆందోళన కార్యక్రమాలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో కోనసీమ జిల్లా పేరులో డా.బీఆర్‌.అంబేడ్కర్‌ పేరును చేరుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

కోనసీమ జిల్లా పేరును అంబేడ్కర్ జిల్లాగా మార్చాలని డిమాండ్‌ చేస్తూ గోదావరి జిల్లా అమలాపురంలో చాలా కాలం నుంచి ఉద్య‌మాలు జ‌రుగుతున్నాయి. ముఖ్యంగా ప్ర‌భుత్వం ముసాయిదా నోటిఫికేష‌న్ జారీ చేసిన ద‌గ్గ‌ర నుంచి కూడా దీనిపై డిమాండ్లు వ‌స్తున్నాయి. అంబేడ్కర్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిర‌స‌న‌ల‌కు వేలాదిగా ప్ర‌జ‌ల నుంచి మ‌ద్ద‌తు ల‌భించింది. అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన అంబేడ్కర్ అభిమానులు , జిల్లా మద్దతుదారులు అనేక రూపాల్లో పోరాటాలు చేశారు.

అదేస‌మ‌యంలో మంత్రి పినిపే విశ్వ‌రూప్‌కు కూడానిర‌స‌న కారులు విన్న‌వించారు. రెండోసారి కేబినెట్‌కు ఎన్నికైన ఆయ‌న‌కు ఈ జిల్లాపై మ‌రిన్ని డిమాండ్లు వ‌చ్చాయి. అయితే.. మొద‌ట్లో ప‌ట్టించుకోని వైసీపీ స‌ర్కారు.. ఇటీవ‌ల కాలంలో ఎస్సీల నుంచి వ్య‌తిరేక‌త వ‌స్తుండ‌డంతో .. వారిని ప్ర‌స‌న్నం చేసుకునేందుకు ఎట్ట‌కేల‌కు త‌న నిర్ణ‌యాన్ని మార్చుకుంది. ఈ క్ర‌మంలోనే తాజాగా కోన‌సీమ జిల్లా పేరును బీఆర్ అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లాగా మారుస్తూ.. నిర్ణ‌యించింది. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేష‌న్ విడుద‌ల కానుంది.

This post was last modified on May 18, 2022 8:44 pm

Share

Recent Posts

నాని వాళ్ళని ఎప్పటికీ వదలడు

నేచుర‌ల్ స్టార్ నాని అంటే ఒక‌ప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్ట‌ర్ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌. ఎక్కువ‌గా ఫ్యామిలీ ట‌చ్ ఉన్న…

2 hours ago

డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ చేసేవాడ్ని

నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…

5 hours ago

ప్యార‌డైజ్ ద‌ర్శ‌కుడు రాజమౌళి ద‌గ్గ‌ర చేరతాడ‌ట‌

ఇండియాస్ నంబ‌ర్ వన్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ విభాగంలో ప‌ని చేయాల‌ని కాబోయే డైరెక్ట‌ర్ కావాల‌నుకున్న ప్ర‌తి వ్య‌క్తికీ…

5 hours ago

ట్రైలర్ లేకపోవడం ఎంత వరకు సేఫ్

అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…

7 hours ago

ఇంద్ర చూపిన దారిలో మిగిలినవీ రావాలి

తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…

9 hours ago

అసలు భయాన్ని థియేటర్‌లో చూపిస్తారేమో

ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…

9 hours ago