పెద్దిరెడ్డి యు టర్న్ – ట్యాపింగ్ కాదు, ట్రాకింగ్

పరీక్షల వ్యవహారం నిన్న పెద్దిరెడ్డి కామెంట్స్ తో కొత్తమలుపు తిరిగిన విషయం తెలిసిందే. పబ్లిక్ గా మంత్రి ట్యాపింగ్ చేసినట్లు వెల్లడించడంతో రచ్చ అయిపోయింది. ముందు నుంచి మేము చెబుతున్నది ఇదే… వైసీపీ మా ఫోన్లను ట్యాప్ చేస్తోంది అని టీడీపీ గట్టిగా విరుచుకుపడింది. దీంతో ప్రభుత్వం ఇరుకునపడింది. మరి రాత్రంతా ఏం సమాలోచన చేశారో గాని మంత్రి పెద్దిరెడ్డి ముఖ్యంగా  కొత్త క్లారిఫికేష‌న్ ఇచ్చారు. దీంతో రాజ‌కీయం మ‌రో మ‌లుపు తీసుకుంది. మేము చేసింది ట్యాపింగ్ కాదు,  ట్రాకింగ్ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. త‌మ‌కు ట్రాకింగ్ అంటే ఏంటో  ట్యాపింగ్ అంటే ఏంటో కూడా తెలుసు అన్న భావ‌న‌తో ఆయ‌న మాట్లాడారు.  

ఇదే విధంగా ఇంతే వేగంతో లీకు అయిన ప‌రీక్ష‌లు ర‌ద్దు చేస్తే ఇంకా  బాగుంటుంది అని అదేవిధంగా పెద్దాయ‌న కూడా బొత్స తో రాజీనామా చేయిస్తే ఇంకా బాగుంటుంది అని సోష‌ల్ మీడియాలో జనం  అంటున్నారు.  ఫోన్ ట్యాపింగ్ అంటే ఆ రోజు ఓటుకు నోటు కేసులో వినిపించిన ప‌దం మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు విన‌ప‌డ‌డం కూడా ఓ విధంగా ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను పున‌రాలోచ‌న‌లో ప‌డేస్తున్నాయి. ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా పెగాస‌స్ అనే స్పై వేర్ కుంభ‌కోణం క‌దిపి కుదిపేస్తుంటే, ఏపీ పెగాసస్ ఈ టెన్తు పరీక్ష‌ల కార‌ణంగా తెర‌పైకి వ‌చ్చిందా అన్న అనుమానాలు వ‌స్తున్నాయి. అదే క‌నుక జ‌రిగితే ట్యాపింగ్ క‌నుక రుజువైతే  ప్ర‌భుత్వంతో పాటు పోలీసులకూ కోర్టు నుంచి ఇబ్బందులు రావొచ్చు. కనుక ట్యాపింగ్ ఏంటి ట్యాకింగ్ ఏంటి అన్న‌వి వివ‌రించి వెళ్లండి పెద్దిరెడ్డి అని అంటున్నాయి టీడీపీ వ‌ర్గాలు.

మ‌రోవైపు నారాయ‌ణ‌కు బెయిల్ విష‌య‌మై  దుమారం రేగింది. దీనిని కూడా పెద్దిరెడ్డితో స‌హా మిగ‌తా వైసీపీ పెద్ద‌లు స‌వాలుగానే స్వీక‌రించారు. స‌జ్జ‌ల చెబుతున్న ప్ర‌కారం వీటిపై కోర్టుకు వెళ్లేందుకు ఛాన్స్ ఉంది. అయితే టెన్త పేప‌ర్ లీకులో  ద‌ర్యాప్తు వేగం చేయ‌డంతో పాటు అదే చేత్తో రాష్ట్రంలో వివిధ ప‌థ‌కాల పేరిట జ‌రిగి ఉన్న కొన్న అవ‌క‌త‌వ‌క‌ల‌పై ఆర్గ‌నైడ్జ్ క్రైం ల‌పై కూడా పెద్దిరెడ్డి మాట్లాడితే ఇంకా బాగుంటుంది అని టీడీపీ నాయ‌కులు సోష‌ల్ మీడియాలో గ‌గ్గోలు పెడుతున్నారు. నారాయ‌ణ విష‌య‌మై  ప‌ట్టుబ‌డుతున్న వైసీపీ అదేవిధంగా సొంత మ‌నుషుల‌కూ ఈ త‌గాదాలో  చోటు ఉంద‌న్న విష‌యం ఎలా మ‌రిచిపోతార‌ని ప్ర‌శ్నిస్తోంది. ఇప్ప‌టిదాకా ఈ కేసులో ప‌స లేద‌ని తేలిపోయిక బెయిల్ ర‌ద్దు చేయాల‌ని హైకోర్టుకు వెళ్లి వైసీపీ సాధించేది నిండు సున్నా అని అంటోంది టీడీపీ.