ఏపీ సీఎం జగన్.. సంచలన విషయాలు వెల్లడించారు. తాజాగా పార్టీ ప్రజాప్రతినిధులు, మంత్రులు, క్షేత్రస్థాయి నేతలతో ఆయన నిర్వహించిన సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎంగా, పార్టీ అధ్యక్షుడిగా తన గ్రాఫ్ 65 శాతం ఉందని జగన్ తెలిపారు. ఎమ్మెల్యేల్లో చాలామందికి 40 నుంచి 45 శాతమే గ్రాఫ్ ఉందని, ఎన్నికల నాటికి గ్రాఫ్ పెరగకపోతే మార్పులు తప్పవని జగన్ వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గడపగడపకు ప్రజల్లోకి తీసుకెళ్లాలని స్పష్టం చేశారు.
వైసీపీ పోరాటం చేస్తోంది టీడీపీ అధినేత చంద్రబాబుతో కాదని, ఓ వర్గం మీడియాతో కూడా అని సీఎం తెలిపారు. సాక్షి టీవీ, పేపర్ ద్వారా పార్టీకి అనుకూలంగా విస్తృత ప్రచారం చేయిస్తున్నట్టు జగన్ వివరించారు. ఎమ్మెల్యేల పనితీరు గ్రాఫ్ పడిపోతే సీటు ఇవ్వనని.. పక్కన పెడతానని జగన్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల పనితీరు నివేదికలు తన దగ్గర ఉన్నాయని, కొంతమంది గ్రాఫ్ కిందకు.. మరికొంతమంది గ్రాఫ్ పైకి ఉందన్నారు. గ్రాఫ్ తగ్గినవాళ్లను నిర్ధాక్షిణ్యంగా తొలగిస్తానని చెప్పారు. రెండేళ్లలో మనం ఎన్నికలకు వెళుతున్నామని, 151 సీట్లకు ఒక్క సీటు తగ్గకూడదని సీఎం జగన్ అన్నారు.
“మనం సంక్షేమం బాగా చేశాం.. 175 ఎందుకు రాకూడదు“ అని ఎమ్మెల్యేలను జగన్ ప్రశ్నించారు. మంత్రులదే కీలక బాధ్యతలు, అవసరమైతే తగ్గండి, జిల్లాలో అందరినీ కలుపుకొని వెళ్లాల్సిన బాధ్యత మంత్రులదే అని సీఎం జగన్ వెల్లడించారు. ప్రతిపక్షం, మీడియా లేనివి ఉన్నట్టు చెబుతున్నారని, జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. మీరంతా ఒక్కటే గుర్తుపెట్టుకోండి..మళ్లీ గెలిపిస్తేనే మీకు మంత్రి పదవి వస్తుందని జగన్ చెప్పారు. మే 10 నుంచి గడపగడపకు వైసీపీ కార్యక్రమం, ఇంటింటికీ వచ్చిన ప్రయోజనాల బుక్‌లెట్ తీసుకొని వెళ్లాలని సీఎం జగన్ స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో జగన్ చాలా వేడి వేడి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పలు అంశాలపై వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం చేశారు. మే 2 నుంచి ‘ఇంటింటికీ వైసీపీ’ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. జులై 8న వైసీపీ ప్లీనరీ ఉంటుందని సీఎం జగన్ చెప్పారు. మే 10 నుంచి గడపగడపకు వైసీపీ కార్యక్రమం, పాత మంత్రులు, జిల్లా అధ్యక్షులకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. రెండేళ్లలో ఎన్నికలకు వెళ్తున్నామని సీఎం జగన్ వెల్లడించారు.
ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం జగన్ వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేనివారిని పక్కనబెడతానని సీఎం జగన్ స్పష్టం చేశారు. రీజినల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులను మంత్రులు కలుపుకు వెళ్లాలని, ఎవరికైనా పార్టీనే సుప్రీం అని కుండబద్దలు కొట్టారు. గెలిస్తేనే మంత్రి పదవి అని, గెలిచేందుకు కావాల్సిన వనరులు సమకూరుస్తానని జగన్ తెలిపారు. ఎవ్వరూ తాము ప్రత్యేకం అనుకోవడానికి వీల్లేదని, 175కి 175 సీట్లు ఎందుకు గెలవమని సీఎం జగన్ ప్రశ్నించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates