వైసీపీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు తర్జన భర్జనకు తెరదీశాయి. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగోలేదని.. రాష్ట్రం ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించాలని.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ డిమాండ్ చేస్తోంది. మరోవైపు.. రాష్ట్రం ఎక్కువగా అప్పులు చేస్తోందని. కేంద్రం కూడా ఇటీవలపార్లెమంటు సమావేశా ల్లో స్పష్టం చేసింది. లెక్కల వారిగా కూడా.. కేంద్ర ప్రభుత్వం వివరించింది. ఇదిలావుంటే.. రాష్ట్రంలో బీజేపీ కూడా దూకుడు పెంచింది. రాష్ట్రానికి ఆదాయం లేదని.. కేవలం కేంద్రం ఇస్తున్న నిధులు.. అప్పులతోనే నెట్టుకువస్తోందని పేర్కొంటోంది.
ఇక, తాజాగా రాష్ట్ర అకౌంటెంట్ జనరల్ గత ఏడాదికి సంబంధించిన ఆదాయం, ఖర్చులు వంటి వాటిపై ఒక నివేదికను వెలువరించారు. దీనిలో 56 శాతం మేరకు రాష్ట్ర ప్రభుత్వం అప్పులుతోనే నెట్టుకు వస్తోందని స్పష్టం చేశారు. నిజానికి అకౌంటెంట్ జనరల్ నివేదిక అంటే.. రాష్ట్రానికి వస్తున్న ఆదాయాన్ని ప్రముఖంగా పేర్కొంటారు. అదేసమయంలో మిగిలిన వివరాలు కూడా వెల్లడిస్తారు. కానీ, ఏపీ విషయానికి వస్తే.. అకౌం టెంట్ జనరల్ ఇచ్చిన నివేదికలో 56 శాతం అప్పులు తీసుకుంటున్నట్టు చూపించారు. అదేసమయంలో 18 శాతం చొప్పున చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నారని.. ఈ నివేదిక స్పష్టం చేయడం గమనార్హం.
అంటే ఎలా చూసుకున్నా.. జగన్ ప్రభుత్వం ఈ మూడు సంవత్సరాల కాలంలో కొత్తగా చేసిన అభివృద్ధి కానీ.. తీసుకువచ్చిన ఆదాయం కానీ.. ఎక్కడా కనిపించడం లేదు. కేవలం అప్పులు చేసి.. పప్పు కూడు తిన్న తరహాలోనే ప్రభుత్వం ఉందని.. అటు కాగ్ కూడా పేర్కొంది. ఈ నివేదికలో అయితే.. అసలు 48 వేల కోట్ల రూపాయలు లెక్క జమ లేకుండా పోయిందని.. వ్యాఖ్యానించింది. మరోవైపు ఎఫ్ ఆర్ బీఎం పరిమితిని మించి ప్రభుత్వం అప్పులు చేస్తోందని.. కేంద్రం కూడా చెప్పింది. ఇది.. పూర్తిగా ప్రభుత్వాన్నిఅప్పులు చేసుకుని.. పాలన సాగించే దిశగానే అడుగులు వేయిస్తోందని మేధావులు సైతం చెబుతున్నారు.
ఈ క్రమంలోనే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ననాయకులు.. కేంద్రానికి ఫిర్యాదులు చేయడం ప్రారంభించా రు. రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ విధించాలని.. జగన్ చేస్తున్న ఆర్థిక అరాచకాన్ని నిగ్గు తేల్చాలని.. పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఏం చేయాలనే అంశంపై పార్టీలోను ప్రభుత్వం లోనూ తర్జన భర్జన పడుతున్నట్టు తెలుస్తోంది. మరి దీనిపై కేంద్రంతో మాట్లాడతారో.. లేక.. ప్రజల్లోకి వచ్చివివరణ ఇస్తారో..చూడాలి. ఏదేమైనా.. గతానికి ఇప్పటికి.. మాత్రం ఏపీ ప్రభుత్వ పరిస్థితి ఇబ్బందుల్లో చిక్కుకుందని అంటున్నారు పరిశీలకులు.