రాష్ట్రం మద్యం విషయం.. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పెద్ద ఎత్తున కుదిపివేసిన విషయం తెలిసిందే. కల్తీసారా, జేబ్రాండ్స్ అంటూ.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పెద్ద ఎత్తున విజృంభించిన విషయం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ క్రమంలోనే అసెంబ్లీ, శాసన మండలిలోనూ.. దీనిపై చర్చకు టీడీపీ పట్టుబట్డింది. కానీ, వైసీపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగి.. సస్పెన్షన్ పర్వానికి తెరదీసిం ది. సరే.. ఇది జరిగిపోయిన గతం. కానీ, ఈ సందర్భంగా సభలో సీఎం జగన్ మాట్లాడిన వ్యాఖ్యలపై మాత్రం ప్రజాక్షేత్రంలో ఇప్పటికీ.. చర్చ సాగుతోంది.
జే బ్రాండ్స్ అంటూ.. టీడీపీ ఏదైతే.. ప్రచారం చేస్తోందో.. వాటిని తాను తీసుకురాలేదని.. దాదాపు 234 రకా ల బ్రాండ్లను గత టీడీపీ ప్రభుత్వమే తీసుకువచ్చిందని.. జగన్ చెప్పారు. దీనిలో తమ ప్రమేయం ఏమీలే దన్నారు. ఎన్నికలకు ముందు.. ఆరు మాసాల్లో.. చంద్రబాబు ప్రభుత్వం.. చవకబారు మద్యాన్ని తీసుకువ చ్చి.. ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుకుందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇక, అదేసమయంలో అసలు తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. బార్ వ్యవస్థను తీసేయాలని అనుకున్నామని అన్నారు.
కానీ, అప్పటికి చంద్రబాబు దిగిపోతూ.. దిగిపోతూ.. బార్లకు ఐదేళ్లపాటు లైసెన్సులు రెన్యువల్ చేశారని.. దీంతోనే ప్రజలకు మద్యం అందుబాటులోకి వచ్చిందని దుయ్యబట్టారు. ఈ రెండు విషయాలపైనే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సామాన్యుల నుంచి మేధావుల వరకు దృష్టి పెట్టారు. నిజమే.. చంద్రబాబు చవకబారు మద్యాన్ని దాదాపు 234 రకాలను ప్రవేశపెట్టారని అనుకుందాం. మరి ప్రజాప్రభుత్వంగా.. రాజన్న రాజ్యాన్ని స్థాపిస్తానని చెప్పిన జగన్.. ఆ నిర్ణయాన్ని ఎందుకు రద్దు చేయలేదు? అనేది ప్రధాన డిమాండ్.
ఎలాంటి అనుమతి లేదని.. పేర్కొంటూ.. దాదాపు 8 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రజావేదికను కూల్చేసిన.. జగన్.. ప్రజలకు హాని చేస్తుందని.. తెలిసి కూడా చంద్రబాబు నిర్ణయించిన(జగన్ చెప్పినట్టు) చవకబారు మద్యాన్ని ఎందుకు ఉపసంహరించలేదు.? అదేసమయంలో మంచి బ్రాండ్ల మద్యాన్ని ఎందుకు కట్టడి చేసినట్టు? అనేది ప్రజల నుంచి వినిపిస్తున్న ప్రశ్న. ఇక, బార్లకు లైసెన్సులు ఇచ్చారు కాబట్టి.. వారు హైకోర్టుకు వెళ్లారు కాబట్టి.. దీనిని ఉపసంహరించుకునే పరిస్థితి లేదు. కానీ, నిజానికి.. మద్యాన్ని కట్టడి చేయాలని.. మద్యంపై ఆదాయాన్ని వద్దని అనుకుంటే.. బార్ల సమయాన్ని భారీ ఎత్తున కుదించుకోవచ్చు కదా.. దీనిని ఎవరు కాదంటారు?
ఏ ప్రభుత్వ ఒప్పందంలోనూ.. సమయంపై ఒప్పందం చేసుకోదు. ఎందుకంటే.. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుందోనని ఈ విషయాన్ని ప్రభుత్వం తన చేతిలోనే ఉంచుకుంటుంది. కోర్టులు కూడా తప్పుపట్టవు. సో. బార్లకు ఉన్న సమయాన్ని కుదించడం వల్ల కూడా.. ప్రజలకు మేలు చేసే అవకాశం ఉందికదా.. కానీ, అలా ఎందుకు చేయలేదు.. అనేది సామాన్యుల ప్రశ్న. ఏదేమైనా.. ఎవరిని ఎవరు మోసం చేస్తున్నారో.. స్పష్టంగా తెలుస్తోందని దుయ్యబడుతున్నారు.