Political News

చిన‌జీయ‌ర్‌తో గ్యాప్ లేదు.. కేసీఆర్

చినజీయర్ స్వామికి తెలంగాణ సీఎం కేసీఆర్ మధ్య కొంతకాలంగా గ్యాప్ ఏర్పడిందనే ప్రచారం జరుగుతోంది.  ఎందుకంటే ముచ్చింతల్‌లో నిర్వహించిన శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలకు కేసీఆర్ దూరంగా ఉన్నారు. ముచ్చింతల్ కార్యక్రమానికి ముందు నుంచే ఇద్దరి మధ్య దూరం పెరిగిందని అందరూ అనుకుంటున్నారు. అయితే ఈ ప్రచారంపై కేసీఆర్ సీరియస్‌గా రియాక్టయ్యారు. ‘‘చినజీయర్‌తో నాకు గ్యాప్ ఉందని ఎవరన్నారు?. మీకు మీరు ఊహించుకుంటే ఎలా?. చినజీయర్‌తో గ్యాప్ పై స్పందించాల్సిన అవసరం లేదు. చినజీయర్‌తో అపోహలు సృష్టించేందుకు ప్రయత్నించవద్దు’’  అని తాజాగా ఆయ‌న వ్యాఖ్యానించారు.

అంతేకాదు.. ఎవ‌రూకూడా అతిగా ఆలోచించ‌వ‌ద్ద‌ని దీనిపై సూచించారు. “ప్ర‌తి విష‌యాన్నీ రాద్ధాంతం చేస్తారేమ‌యా?  నాకు తెల్వ‌క అడుగుతున్నా.. ప్ర‌తి విష‌యం ఫ‌స్ట్ పేజీలల్లో రాసుకునేలా చేస్తారా“ అని త‌న‌దైన శైలిలో ఆయ‌న మీడియాను ప్ర‌శ్నించారు. దీంతో ఈ వివాదానికి తెర‌ప‌డిన‌ట్టేనా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కానీ, ఎక్క‌డా తెర‌ప‌డిన‌ట్టు క‌నిపించ‌డం లేదు. సీఎం స్వ‌యంగా చెప్పినాకూడా.. జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. చిన‌జీయ‌ర్‌కు, సీఎంకు మ‌ధ్య గ్యాప్ నిజ‌మేన‌ని అంటున్నారు.

ఎందుకంటే.. తాజాగా యాదాద్రి ప్రధానాలయ ఉద్ఘాటన.. మహాకుంభ సంప్రోక్షణను పాంచరాత్రాగమ శాస్త్రరీతిలో ఈ నెల 28న  నిర్వహించనున్నారు.  ఇక్కడే అసలు ముచ్చట ఉంది. యాదగిరిగుట్టను యాదాద్రిగా పేరు మార్చింది చినజీయర్ స్వామే. ఆలయ పున:నిర్మాణం అంతా ఆయన సూచనలు, సలహాలతోనే నిర్మించారు. యాదాద్రి ఆలయ పున:నిర్మాణానికి ముగ్గు వేసిన చినజీయర్ స్వామి లేకుండానే ఈ ఉద్ఘాటన  కార్య‌క్ర‌మం జరగుతోంది. ఇదే విషయంపై ఇటీవల పిలిస్తే యాదాద్రి పోతామని లేక‌పోతే.. దూరంగా ఉండి చూస్తామ‌ని.. చినజీయర్ మీడియా ముఖంగా తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి కబురు చినజీయర్‌కు వెళ్లినట్లు కనబడలేదు. అందరూ ఆహ్వానితులే అంటున్నారనే తప్ప ప్రత్యేకంగా చినజీయర్‌ను ఆహ్వానించిన దాఖలాలు కనిపించడం లేదు. దీనిని బ‌ట్టి.. `గ్యాప్‌` నిజ‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

గ‌తంలో ఏం జ‌రిగిందంటే..

ముచ్చింతల్‌లో అట్టహానంగా ఏర్పాటు చేసిన శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలకు కేసీఆర్ పోలేదు. కొంతకాలంగా కేంద్రంతో తలపడేందుకు కేసీఆర్ సిధ్దమవుతున్నారు. ఇప్పుడు కేసీఆర్, బీజేపీ మధ్య ఎలాంటి పరిస్థితి ఉందంటే ఢీ అంటే డీ అనే స్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మహా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రధాని మోడీని చినజీయర్‌ స్వామి గొప్పగా కొనియాడారు. మోడీ పాలనపై ప్రశంసలు కురిపించడమే కాకుండా ఆయనను శ్రీరామచంద్రునితో పోల్చారు. ఈ విగ్రహావిష్కరణకు మోడీ కన్నా అర్హులు భారతదేశంలో ఎవరూ లేరని కీర్తించారు. అసలే కాకమీద ఉన్న కేసీఆర్‌కు ఈ పొగడ్తలు మరింత ఆగ్రహం తెప్పించాయి.

రామానుజ సహస్రాబ్ది వేడుకలు జరుగుతున్న తీరుతోపాటు వేడుకలు నిర్వహిస్తున్న చినజీయర్‌ స్వామి, మైహోం అధినేత రామేశ్వరరావుపై సీఎం ఆగ్రహంతో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో మహా విగ్రహావిష్కరణ కార్యక్రమానికి కేసీఆర్ పోలేదు. అయినా ఆయనను రప్పించేందుకు అనేక ప్రయత్నాలు చేశారని ప్రచారం జరిగింది. మహా విగ్రహావిష్కరణ ముగింపు రోజు జరగాల్సిన శాంతికల్యాణాన్ని కేసీఆర్‌ కోసమే వాయిదా వేశారని ప్రచారం సాగింది. అయినా కేసీఆర్ శాంతికల్యాణానికి వెళ్లలేదు.  ఈ నేప‌థ్యంలోనే జీయ‌ర్‌తో కేసీఆర్‌కు వివాదాలు ఉన్నాయ‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఇప్పుడు అవేవీ లేవ‌ని సీఎం అన్నా కూడా.. యాదాద్రి విష‌యం ప‌రిశీలిస్తే.. నిజ‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on March 22, 2022 9:39 am

Share

Recent Posts

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

1 minute ago

నేను చూసిన తెలంగాణ అదే

ద‌స‌రా త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్లో వ‌చ్చిన ది ప్యార‌డైజ్ సినిమా మిశ్ర‌మ స్పంద‌న…

2 hours ago

అనిల్ రావిపూడి అందుకే స్పెషల్

హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…

3 hours ago

స్థాలిన్ కూడా నోరు జారితే ఎలా?

గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…

4 hours ago

వందల కోట్ల ఆస్తి మిస్సయిన నవదీప్

మంచి అందగాడు, పెర్ఫామెన్స్ విషయంలోనూ ఢోకా లేదు. అయినా నవదీప్ టాలీవుడ్లో అనుకున్నంత పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. తేజ మూవీ…

4 hours ago

పోటీకి రావడంలో ‘రియాలిటీ’ ఉద్దేశమేంటో

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మంచి జోష్ లో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ థియేట్రికల్ రన్ లో సూపర్…

4 hours ago