Political News

పెగాస‌స్‌పై త‌గ్గేదేలే.. ఏపీ అసెంబ్లీ సంచ‌ల‌న నిర్ణ‌యం

రాష్ట్రాన్ని కుదిపేస్తున్న పెగాస‌స్ వ్య‌వ‌హారంపై ఏపీ అసెంబ్లీ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. పెగాసెస్‌పై హౌస్‌ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. పెగాసెస్‌పై హౌస్‌ కమిటీ ఏర్పాటు చేయాలని ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఏపీలో పెగాసస్ స్పై వేర్ కలకలం రేపుతోంది. టీడీపీ హయాంలో పెగాసెస్ స్పైవేర్ కొనుగోలు చేశారన్న పశ్చిమ్‌బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కామెంట్లతో ఏపీ రాజకీయాల్లో చర్చ మొదలైంది. పెగాసెస్ స్పైవేర్ ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేయలేదని గతంలో మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు.

పెగాసెస్ సాఫ్ట్ వేరును ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసిందా అంటూ ఓ ఆర్టీఐ దరఖాస్తుదారు అడిగిన ప్రశ్నకు  మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ రిప్లై ఇచ్చారు. తమ హయాంలో పెగాసెస్ స్పైవేర్  కొనుగోలు చేయలేదని ఇప్పటికే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ.. ఏపీ అసెంబ్లీలో రోజు రోజంతా.. సోమ‌వారం ఈ అంశంపై నే చ‌ర్చ చేప‌ట్టారు. పెగాసస్‌ స్పైవేర్‌పై చర్చలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ మాట్లాడుతూ.. పెగాసస్‌ వంటి స్పైవేర్‌తో వ్యక్తిగత స్వేచ్ఛకు విఘాతం కలుగుతుందని తెలిపారు. ఇది ప్రమాదమే కాదు.. అనైతికమని కూడా అన్నారు.

చంద్రబాబు పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ కొన్నారని సీఎం మమతా చెప్పారని తెలిపారు. ఈ స్పైవేర్‌తో వ్యక్తిగత వివరాలన్నీ తెలుసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఇలాంటి అనైతిక కార్యక్రమాలు ఇల్లీగల్‌గానే చేస్తారని అన్నారు. చంద్రబాబు చేసిన చర్య.. మానవహక్కులకు భంగం కలిగించడమే అని పేర్కొన్నారు. పెగాసస్‌ను కొనడం.. ఘోరమైన నేరమని తెలిపారు. చంద్రబాబుకు అడ్డదారి రాజకీయాలు మాత్రమే తెలుసని అన్నారు. పెగాసస్‌ను చంద్రబాబు రాజకీయనేతలపై ఉపయోగించారని అ‍న్నారు.2016లో పెగాసస్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని తెలిపారు. ప్రమాదకర సాఫ్ట్‌వేర్‌ను చంద్రబాబు కొన్నారంటే ఎంత దుర్మార్గం అని తెలిపారు. పెగాసస్‌తో ఏం చేశారో  దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

సేవామిత్ర యాప్‌ ద్వారా కూడా టీడీపీ.. ఓటర్లపై నిఘా పెట్టిందని మంత్రి బుగ్గన తెలిపారు. వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉండేవారి ఓట్లను తొలగించారని అన్నారు. ఆధార్‌ డేటా సేకరించి ఏ ఓటర్‌ ఏ పార్టీకి ఓటు వేస్తారో తెలుసుకునే యత్నం జరిగిందని తెలిపారు. ఈ వ్యవహారంపై విచారణ కొనసాగుతోందని చెప్పారు. ఏబీ వెంకటేశ్వరరావు ఎన్నిసార్లు ఇజ్రాయెల్‌ వెళ్లారో తనకు తెలియదని అన్నారు. వైఎస్సార్‌సీపీ నేతలతో పాటు, తన ఫోన్‌  ట్యాంపర్‌ అయిందని తెలిపారు. ఆనాడు సజ్జల రామకృష్ణారెడ్డి అఫిడవిట్‌ దాఖలు చేశారని చెప్పారు. ఇది రాజ్యాంగానికి విఘాతం కలిగించే చర్య అని సజ్జల అ‍న్నారని గుర్తుచేశారు.  పెగాసస్‌పై హౌస్‌కమిటీతో విచారణ జరపాలని మంత్రి బుగ్గన కోరారు. ఇదే విధంగా ఇత‌ర స‌భ్యులు కూడా డిమాండ్ చేయ‌డంతో స‌భాప‌తి హౌస్‌క‌మిటీకి ఆర్డ‌ర్ ఇచ్చారు.

This post was last modified on March 22, 2022 9:30 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ట్రైలర్ : అరాచకం ..విధ్వంసం… ‘పుష్ప 2’ వైల్డ్ ఫైర్

https://youtu.be/g3JUbgOHgdw?si=jpCbsxB5cP_qeRwA ఇతర రాష్ట్రాల్లో ప్రభాస్ కాకుండా ఒక తెలుగు హీరోకి ఇంత క్రేజ్ ఏమిటాని అందరూ ఆశ్చర్యపోయే రీతిలో పుష్ప…

1 hour ago

జైలు వరకు వెళ్లిన కస్తూరి కేసు

తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నటి కస్తూరి అరెస్ట్ తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఇటీవల చెన్నై…

2 hours ago

పుష్ప 3 లో యాక్ట్ చేస్తావా? : తిలక్ ఏమన్నాడంటే…

‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ ఎంత డీగ్లామరస్‌గా కనిపిస్తాడో తెలిసిందే. ఒక ఎర్రచందనం కూలీ పాత్ర కావడంతో అందుకు తగ్గట్లు…

5 hours ago

‘దళపతి విజయ్’ : సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా..

కోలీవుడ్‌లో చిన్న వ‌య‌సులోనే మంచి పేరు సంపాదించుకున్న ద‌ళ‌ప‌తి విజ‌య్‌. విజ‌య్ సినిమాలు.. క్రిటిక్స్‌, రివ్యూస్‌కు సంబంధం లేకుండా.. అంచ‌నాలు…

6 hours ago

అవినాష్‌రెడ్డికి మ‌రో చిక్కు.. ఇక‌, బీటెక్ రెడ్డి వంతు!

వైసీపీ కీల‌క నాయ‌కుడు, క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్ప‌టికే చాలా చిక్కుల్లో ఉన్నారు. ఒక‌వైపు బాబాయి వివేకానంద‌రెడ్డి దారుణ…

9 hours ago