‘ఆర్ఆర్ఆర్’ టీం ఇప్పటిదాకా ఎన్నో ప్రమోషనల్ ఇంటర్వ్యూలు, స్పెషల్ ప్రోగ్రామ్స్ చేసింది. కానీ వాటిలో ‘ది బెస్ట్’ ఏది అంటే మాత్రం.. కొత్తగా సుమతో కలిసి రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి చేసిన ‘మీమ్ స్పెషల్’ ఇంటర్వ్యూ అనే చెప్పాలి. నిజంగా ఆ ఇంటర్వ్యూకు అంతుందా అని డౌటొస్తే వెంటనే యూట్యూబ్‌లోకి వెళ్లి ఆ వీడియోను చూసేయండి. ఈ స్టేట్మెంట్ నిజమే అని ఒప్పుకుని తీరుతారు.
తమ మీద ఇంటర్నెట్లో వైరల్ అయిన సెటైరికల్ మీమ్స్, జోకులు, వీడియోలను చూస్తూ ఈ ముగ్గురూ నవ్వుకుంటూ కామెంట్లు చేస్తుంటే అంతకంటే ఆసక్తి ఇంకేముంటుంది? ముఖ్యంగా ‘ఆర్ఆర్ఆర్’ మొదలైనప్పటి నుంచి రాజమౌళి మీద వచ్చిన బెస్ట్ మీమ్స్ తీసుకొచ్చి వాటిని స్క్రీన్ మీద చూపిస్తూ యాంకర్ సుమ తనదైన శైలిలో రన్నింగ్ కామెంట్రీ ఇవ్వడంతో చూసే వాళ్లకు కడుపు చెక్కలైపోయింది.
స్వయంగా రాజమౌళి ఈ మీమ్స్ చూసి పగలబడి నవ్వుకోవడం విశేషం. ‘ఆర్ఆర్ఆర్’కు సంబంధించి తొలి ప్రెస్ మీట్ పెట్టినపుడు.. ఈ చిత్రం ఆలస్యం కాదని, కచ్చితంగా 2020లో వస్తుందని.. 2021, 2022కు వెళ్లే ఛాన్సే లేదని జక్కన్న నొక్కి వక్కాణించడం తెలిసిందే. ఈ దృశ్యం చూపించి ఆడియన్స్ రియాక్షన్‌ను ఫన్నీగా చూపిస్తూ క్రియేట్ చేసిన మీమ్ అన్నింట్లోకి హైలైట్ అని చెప్పాలి. ఇలాంటి ఫన్నీ మీమ్స్ ఇంకెన్నో ఈ వీడియోలో చూపించారు. ప్రధానంగా రాజమౌళి సినిమాలు తీయడంలో జరిగే ఆలస్యం.. రీటేక్స్ పేరుతో హీరోలను సతాయించే తీరు గురించి పలు మీమ్స్ మంచి వినోదాన్ని పంచాయి.
తాను, తారక్ రెండేళ్లు ‘ఆర్ఆర్ఆర్’లో బిజీగా ఉంటామని ప్రభాస్‌తో చరణ్ అంటే.. రెండేళ్లని సినిమా అయిపోతుందని అకుంటున్నారు పిచ్చోళ్లు అని రాజమౌళితో ప్రభాస్ నవ్వుతూ చెబుతున్నట్లుగా ఉన్న ఇంకో మీమ్ కూడా పేలిపోయేదే. చాలా వరకు జక్కన్న మీదే ఈ మీమ్స్‌లో పంచులు పడ్డాయి. కానీ వాటన్నింటినీ ఆయన స్పోర్టివ్‌గా తీసుకుని తనపై పేలిన జోకులకు పగలబడి నవ్వుకోవడం విశేషం. అంతే కాక మీమర్స్ అందరికీ మంచి కాంప్లిమెంట్లు కూడా ఇచ్చారాయన.
This post was last modified on March 22, 2022 9:47 am
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……
అగ్ర రాజ్యం అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఆ దేశ ప్రముఖ వ్యాపారవేత్త డొనాల్డ్ జే ట్రంప్ రెండు రోజుల క్రితం…