ఎన్ని పార్టీలు క‌లిసినా.. వైసీపీ నేత‌ల ధైర్యం ఇదే..

అధికార పార్టీ వైసీపీలో ధైర్యం చెక్కు చెద‌ర‌డం లేదు. వ‌చ్చే ఎన్నిక‌లు అత్యంత ప్రతిష్టాత్మ‌కం కాను న్న‌ప్ప‌టికీ.. మేమే గెలుస్తాం అనే ధీమా వారిలో వ్య‌క్త‌మ‌వుతోందని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. నిజానికి సీఎం జ‌గ‌నే స్వ‌యంగా చెప్పిన‌ట్టు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు అంత ఈజీకాదు! వైసీపీని ఒంట‌రిని చేసి. అన్నిప‌క్షాలు కూట‌మి క‌ట్టే దిశ‌గా అడుగులు వేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో వైసీపీ ఏవిధంగా పుంజుకోవా లి..ఎలా ముందుకు వెళ్లాలి.. అనే విష‌యాల‌పై స్వ‌యంగా ముఖ్య‌మంత్రి జ‌గ‌నే దృష్టి పెట్టారు.

అయితే.. క్షేత్ర‌స్థాయిలో మాత్రం నేత‌లు.. ఈ విష‌యాన్ని లైట్ తీసుకుంటున్నారు. వీరి అంచ‌నా ప్ర‌కారం.. రాష్ట్రంలోని 175 నియోజ‌వ‌క‌ర్గాల్లో.. వైసీపీ ఖ‌చ్చితంగా 140 చోట్ల గెలుపు గుర్రం ఎక్కుతుంద‌ని ఒక లెక్క చెబుతున్నారు. అంతేకాదు.. ఎలాంటి రాజ‌కీయ ప‌రిణామాల‌ను ఎదుర్కొనైనా.. ఈ 140 మంది నాయ‌కులు విజ‌యం ద‌క్కించుకోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. ప్ర‌ధానంగా నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ బ‌లోపేతంగా ఉండ‌డం దీనిని సంకేతంగా చెబుతున్నారు.

140 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు బ‌లంగా ఉన్నార‌ని.. స్ప‌ష్టంగా క‌నిపిస్తున్న ప‌రిణామాల‌ను బ‌ట్టి తెలు స్తోంద‌ని.. వారు అంటున్నారు. నిజానికి 2019 ఎన్నిక‌ల స‌మయం లోనూ ఇదే అంకెను వైసీపీ న‌మ్ముకుం ది. ఎన్ని ఇబ్బందులు వ‌చ్చినా.. ఎంత పోటీ ఉన్నా.. 130 నుంచి 140 సీట్లు త‌మ‌కు త‌గ్గ‌వ‌ని.. అప్ప‌ట్లో నాయ‌కులు చెప్పారు. అయితే..అనూహ్యంగా 151 సీట్లు వ‌చ్చాయి. ఇప్పుడు కూడా ఇదే అంచ‌నాతో ఉన్న‌ట్టు తెలుస్తోంది. కానీ, అధిష్టానం మాత్రం గెలుపుపై ఒకింత భ‌యంభ‌యంగానే ఉంది.

క్షేత్ర‌స్థాయిలో ఉన్న ధైర్యం అధిష్టానంలో క‌నిపించ‌డం లేదు. అయితే.. ఇక్క‌డ క్షేత్ర‌స్థాయిలో ఉన్న ధైర్యం ఏంటంటే.. త‌మ అధినేత సంక్షేమం బాగా అమ‌లు చేస్తున్నారు కాబ‌ట్టి.. త‌మ‌కు తిరుగులేదేని వారు భావిస్తూ ఉండొచ్చు. కానీ, ఇలాంటి సంక్షేమం గ‌త చంద్ర‌బాబు కూడా చేశారు. అయినా.. కూడా పార్టీ ఓడిపోయింది. ఈ నేప‌థ్యంలో అధిష్టానం శంకిస్తోంది. నాయ‌కులు మాత్రం 140 స్థానాల్లో గెలుపు ఖాయ‌మ‌ని చెబుతున్నారు.

ఒక వేళ ఎవ‌రైనా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ఉంటే.. వారిని  మార్చేసి మ‌రొక‌రికి అవ‌కాశం ఇస్తే స‌రిపోతుంద‌ని చెబుతున్నారు.  అయిన‌ప్ప‌టికీ.. నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌లమైన ఓటు బ్యాంకు, వైసీపీకి కార్య‌క‌ర్త‌లు, క్షేత్ర‌స్థాయిలో పార్టీ కేడ‌ర్ ఉండ‌డంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఖ‌చ్చితంగా 130 నుంచి 140 స్థానాల‌ను నిల‌బెట్టుకోవ‌డం త‌థ్య‌మ‌నే ధీమా అయితే.. వైసీపీ సీనియ‌ర్ల మ‌ధ్య  వ్య‌క్త‌మ‌వుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఈ ధైర్యం నిజంగాన‌నే పార్టీని గెలుపు గుర్రం ఎక్కిస్తుందా.. లేక‌.. తుస్సు మ‌నిపిస్తుందా?  చూడాలి.