ఏపీ సీఎం జగన్పై సినిమా తీయాలని.. ఉపముఖ్యమంత్రి, చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజక వర్గం ఎమ్మెల్యే నారాయణస్వామి అన్నారు. అంతేకాదు.. ఆళ్లను, ఈళ్లను కాకుండా.. ఏకంగా..జగన్ జీవితంపై సినిమా తీస్తే.. వెయ్యిరోజులు రాష్ట్రంలోనే కాకుండా.. ఓవర్ సీస్లోనూ సూపర్ డూపర్ హిట్ అవుతుందని.. సంచలన కామెంట్లు చేశారు. తాజాగా జగనన్న చేదోడు పథకం ప్రారంభించిన సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర విషయాలు చెప్పారు.
ప్రతి పేదవాని కంట్లో ఆనందం నింపేలా నవరత్నాలు ప్రవేశ పెట్టారని సీఎం జగన్ను మంత్రి కొనియాడా రు. వడ్డీ లేని రుణాలు అందిస్తున్న సమయంలో మహిళల ఆనందానికి అవధుల్లేవన్నారు. ఓటర్లు జగన్ వైపు ఉన్నంతరవకు సీఎంను ఎవరు ఏం చెయ్యలేరని మంత్రి నారాయణ స్వామి ధీమా వ్యక్తం చేశారు.
ఒక కమ్యూనిటీ వాళ్ళు రెండు మూడు రోజులు చూస్తే సినిమా విజయ వంతం అవుతుందా? అంటూ.. పరోక్షంగా భీమ్లా నాయక్ సినిమాపై సటైర్లు పేల్చారు. జగన్ నిర్ణయం మేరకు అఖండ, పుష్ప, బంగారాజు చిత్రాలు మంచి ఆదరణ పొందింది కదా ? అని పవన్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు.. పవన్ సినిమా మీద రార్థాంతం ఎందుకు చేస్తున్నారని.. నారాయణ స్వామి ప్రశ్నించారు. సొంత పిల్లను ఇచ్చిన బామర్ధి బాలకృష్ణ నటించిన చిత్రంపై చంద్రబాబు ఎందుకు పోరాడ లేదు? అని చంద్రబాబుకు కౌంటర్ విసిరారు.
చంద్రబాబుకు పదవి, ధన దాహం ఎక్కువైందన్నారు. సినీ నిర్మాతలు నష్ట పోతే ఏ హీరో అయినా అదుకుంటున్నాడా? అని నిలదీశారు. ఒక్కో చిత్రానికి 50 కోట్లు తీసుకొని ప్రజలకు ఏమైనా సేవ చేస్తున్నారా…? అని పవన్ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ప్రతి పేదవాడి హీరో జగన్ నేనని చెప్పిన.. నారాయణ స్వామి.. సిఎంపై సినిమా తీస్తే వెయ్యి రోజులు ఆడుతుందని వ్యాఖ్యానించడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates