తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పనైపోయిందని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్లో పదాధికారుల భేటీలో బండి సంజయ్ పాల్గొన్నారు. పార్టీ సీనియర్ నాయకులైనా క్రమశిక్షణ మీరితే వేటు తప్పదని సంజయ్ హెచ్చరించారు. ఏ పార్టీలోనైనా నిత్య అసమ్మతివాదులుంటారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పనైపోయిందని… ఈ పరిస్థితుల్లో దేశ రాజకీయాలంటూ కొత్త నాటకాలు మొదలెట్టారని విమర్శించారు.
బీజేపీపై కేసీఆర్ విష ప్రచారం చేస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. ప్రశ్నిస్తే గృహనిర్బంధాలు, కేసులని భయపెడుతు న్నారని ఆరోపించారు. మున్ముందు బీజేపీ శ్రేణులకు మరిన్ని నిర్బంధాలు తప్పవని సూచించారు. కేంద్ర నాయకత్వం పూర్తి అండగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. “రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పనైపోయింది. దేశ రాజకీయాలంటూ కొత్త నాటకాలు మొదలెట్టారు. బీజేపీపై కేసీఆర్ విష ప్రచారం చేస్తున్నారు. ప్రశ్నిస్తే గృహనిర్బంధాలు, కేసులని భయపెడుతున్నారు“. అని నిప్పులు చెరిగారు.
మున్ముందు బీజేపీ శ్రేణులకు మరిన్ని నిర్బంధాలు తప్పవని చెప్పారు. “తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది. కేంద్ర నాయకత్వం పూర్తి అండగా ఉంది. ఏ పార్టీలోనైనా నిత్య అసమ్మతివాదులుంటారు. సీనియర్ నాయకులైనా క్రమశిక్షణ మీరితే వేటు తప్పదు“ అని బండి వ్యాఖ్యానించారు. అంతేకాదు.. రాష్ట్రంలో అభివృద్ధి చేసింది కేంద్ర నిధులతోనేనని.. చెప్పారు. కేంద్రం నుంచి నిధులు తీసుకుంటూ.. రాష్ట్రం బీదపలుకులు పలుకుతోందని అన్నారు.
ఏ పార్టీలోనైనా కొందరు నిత్య అసమ్మతి వాదులుంటారన్నారు. వారు పనిచేయరని, పనిచేసే వాళ్లపై అక్కసు గక్కడమే వారి పని అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. పార్టీ కోసం చిత్తశుద్దితో కృషి చేయాలన్నారు. రాబోయే రోజుల్లో అధికారంలోకి వచ్చే సమయమిదన్నారు. అలాంటి వాళ్ల మాటలు నమ్మి దారి తప్పితే రాజకీయ భవిష్యత్ దెబ్బతింటుందని బండి సంజయ్ పార్టీ నేతలను హెచ్చరించారు.