ఏపీ సీఎం జగన్ దూకుడు గురించి తరచుగా వార్తలు వస్తుంటాయి. ఆయన కుటుంబ సభ్యుల్లో ఆయనదే పైచేయి అని.. ఆయన ఎవరి మాట వినరని.. కూడా వార్తలు వస్తుంటాయి. ఇక సోషల్ మీడియాలో అయితే.. సీఎం జగన్ గురించిన చర్చ అంతా ఇంతా కాదు! ఇప్పుడు ఏకంగా.. ఆయన ఒక ఎమ్మెల్యేను కొట్టారంటూ.. సోషల్ మీడియాలో ఒక ఐటం.. తీవ్రస్తాయిలో హల్చల్ చేస్తోంది. అయితే.. ఈ వార్త ఏపీలో కంటే.. తెలంగాణలోనే ఎక్కువగా వైరల్ అవుతోంది. దీంతో అసలు కథ ఏంటనేది.. ప్రజలకు అర్ధం కాక.. సదరు ఎమ్మెల్యేకు ఫోన్లపై ఫోన్లు చేస్తున్నారు. సార్.. మీపై సీఎం జగన్ చేయి చేసుకున్నారా? అంటూ.. ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఏపీలోనూ ఈ వార్త హాట్ టాపిక్గా మారింది.
విషయంలోకి వెళ్తే.. కృష్ణా జిల్లాలోని మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. ఇయనపై ముఖ్యమంత్రి జగన్ చేయి చేసుకున్నాడంటూ ఓ పోస్టు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. అయితే ఇదంతా తప్పుడు ప్రచారమంటూ వైసీపీ శ్రేణులు తీవ్రంగా విరుచుకుపడుతున్నాయి. మరోవైపు స్థానికులు కూడా ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి పరామర్శలు ప్రారంభించారు. దీంతో విషయం ఎమ్మెల్యే వరకు ఈ చేరింది. దీంతో ఒక్కసారిగా ఖంగుతిన్న ఆయన.. ఇది బూటకపు వార్త అని కొట్టి పారేశారు. అంతేకాదు.. వెంటనే ఆయన మైలవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు.
ఎమ్మెల్యే ఫిర్యాదులో రంగంలోకి దిగిన పోలీసులు.. సదరు సోషల్ మీడియా పోస్టు ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై కూపీ లాగే పనిలో నిమగ్నయమ్యారు. ఈ పోస్టుకు సంబంధించిన మూలాలు తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రచారం వెనుక ఖమ్మం జిల్లాకు చెందిన తెలుగు యువతలో పని చేస్తున్న ఓ కీలక నాయకుడి ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. వెంటనే రెండు బృందాలు అక్కడకు చేరుకున్నాయి. అదేసమయంలో తెలుగు యువత ను కూడా కొందరిని ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది అయితే.. పోస్టు పెట్టిన సదరు వ్యక్తి అందుబాటులో ఉండకపోవడంతో.. అనుమానాలు బలపడుతున్నాయి. చివరికి ఇది మరో రాజకీయ రచ్చగా మారుతుందనే ప్రచారం జరుగుతుండడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates