ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అనే టెన్షన్ ఇప్పుడు అధికార వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దీనికి కారణంగా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లుగా సీఎం జగన్ ఆలోచనల ప్రకారం వెలువడుతున్న అధికారిక ఆదేశాలు. ఏపీ ముఖ్యమంత్రి పాలనను ప్రక్షాళన చేయాలని డిసైడయ్యారని, ఇందులో మొదటి ఫోకస్ తన టీంపైనే పెట్టారని అంటున్నారు.
అందులో భాగంగానే తాజా ఆదేశాలు వెలువడటం అని వివరిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక బాధ్యతల్లోకి తన ఆలోచనలకు తగిన అధికారులను ఎంపిక చేసుకునన సంగతి తెలిసిందే. అయితే, అలాంటి అధికారులను ఇప్పుడు జగన్ బదిలీ చేస్తున్నారు.
సీఎం పేషీలో అత్యంత కీలక పాత్ర పోషించిన సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ కు ఈ మేరకు షాక్ ఎదురైంది. ఆయన్ను ఢిల్లీకి, అందులోనూ అప్రధాన్య పోస్టుకు బదిలీ చేశారు. ఈ ఆదేశాలు వెలువడిన మరుసటిరోజే డీజీపీ గౌతమ్ సవాంగ్‌పై వేటు వేసేశారు జగన్. కీలకమైన ఉద్యోగుల పీఆర్సీ అంశమే ఈ ఇద్దరు ఉన్నతాధికారుల బదిలీ నిర్ణయానికి కారణమని ప్రచారం జరుగుతోంది.
ఉద్యోగుల పీఆర్సీ విషయంలో ప్రభుత్వం ఇరకాటంలో పడకుంఆ చేయడంలో ప్రవీణ్ ప్రకాష్ సరైన రీతిలో వ్యవహరిచలేదని ఏపీ సీఎం భావించినట్లు సమాచారం. మరోవైపు లక్షలాది మంది ఉద్యోగులు విజయవాడకు చేరుకుని తమ బలాన్ని ప్రదర్శించారు. పోలీసుల వైఫల్యమే దీనికి కారణమని ప్రభుత్వం భావిస్తోంది. భారీగా తరలి వచ్చిన ఉద్యోగులను నిలువరించడంలో సవాంగ్ పనితనం విఫలమయిందని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే డీజీపీ సవాంగ్ ను బదిలీ చేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్టు సమాచారం.
Gulte Telugu Telugu Political and Movie News Updates