ప్రభుత్వం కంటే ఫాస్ట్ – బాధితులకు అండగా భువనేశ్వరి

ఈమధ్యనే గ్రేటర్ రాయలసీమ ప్రాంతమంతా భారీగా కురిసిన వర్షాలు, వరదల కారణంగా పెద్దఎత్తున ప్రాణ, ఆస్తినష్టం జరిగిన విషయం తెలిసిందే. కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలు బాగా దెబ్బతిన్నాయి.

అప్పట్లో భారీ వర్షాలకు, వరదల కారణంగా నష్టపోయిన బాధితుల దగ్గరకు భువనేశ్వరి సోమవారం వెళ్ళబోతున్నట్లు ఎన్టీయార్ ట్రస్టు వర్గాలు చెప్పాయి. బాధిత కుటుంబాలకు ఎన్టీయార్ మెమోరియల్ ట్రస్టు తరపున తలా లక్ష రూపాయలను భువనేశ్వరి అందించబోతున్నారట. మొత్తం 48 కుటుంబాలకు భువనేశ్వరి ఆర్ధికసాయం అందించబోతున్నారు. వర్షాలు, వరదల సమయంలోనే చంద్రబాబునాయుడు పర్యటించి ప్రతి కుటుంబానికి తలా రు.2 వేలిచ్చిన విషయం తెలిసిందే.

భువనేశ్వరిపై టీడీపీ వంశీ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఆమధ్య ఎంత దుమారం రేపాయో అందరికీ తెలిసిందే. అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ ఎంఎల్ఏలు తన భార్య భువనేశ్వరిని అవమానించినట్లు చంద్రబాబు ఆవేదన చెంది అసెంబ్లీ నుంచి శాశ్వతంగా వాకౌట్ చేస్తూ సీఎం అయ్యాకే సభలో అడుగుపెడతానని శపథం చేశారు. అనంతరం మీడియా సమావేశంలో భోరున ఏడ్చారు. ఇది తెలుగుదేశం శ్రేణులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. సాధారణ జనాల్లో కూడా వైసీపీ సభ్యుల తీరుపై ఏహ్యభావం వ్యక్తమైంది. ఆ తర్వాత ఎన్టీయార్ కుటుంబసభ్యులు కూడా భువనేశ్వరికి మద్దతుగా మీడియా సమావేశం పెట్టడం అందరికీ గుర్తుండే ఉంటుంది.

దీంతో అప్పట్లో భువనేశ్వరి వైసీపీకి వ్యతిరేకంగా రాష్ట్రమంతా పర్యటిస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఎందుకనో ప్రచారం ప్రచారంగానే మిగిలిపోయింది. అయితే ఆమెపై అనేక అవాకులు చెవాకులు పేలుతున్నా పట్టించుకోకుండా… ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఆమె సహాయ కార్యక్రమాలు చేపట్టారు. వరద బాధితులను కూడా కలిశారు. వారి బాధలు విన్నారు. తాజాగా వరదల వల్ల మరణించిన కుటుంబాలకు రూ.48 లక్షలు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పు సాయం అందిస్తున్నారు.